Dinesh Karthik: అంతర్జాతీయ క్రికెట్ కు దినేష్ కార్తిక్ గుడ్ బై.. వీడియో వైరల్

టీమిండియాలో కీలక ఆటగాడు అయిన దినేష్ కార్తిక్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా డీకే పోస్ట్‌ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 Dinesh Karthik: టీమిండియా ఇటీవల కాలంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఘోరంగా విఫలమవడంతో చాలా మంది కీలక ప్రేయర్స్ తమ కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. కాగా కొంతమంది ప్లేయర్స్ ని రాబోవు కాలంలో జరుగనున్న టోర్నీలకు ఇప్పటికే బీసీసీఐ పక్కనపెట్టేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియాలో కీలక ఆటగాడు అయిన దినేష్ కార్తిక్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా డీకే పోస్ట్‌ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మొన్నటివరకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జట్టులో ఉండడంతో మరో వికెట్ కీపర్‌కు అవకాశం లేకుండా పోయింది. పార్థివ్ పటేల్ సహా దినేష్ కార్తీక్ కూడా ఎక్కువగా అవకాశాలు అందుకోలేదు. ధోనీ రిటైర్మెంట్ అనంతరం వికెట్ కీపర్ గా డీకే, రిషబ్ పంత్‌లకు అవకాశాలు వచ్చాయి. ఐపీఎల్ 2022లో అద్భుత ప్రదర్శన చేసి ఫినిషర్‌గా డీకే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మంచి విజయాలు అందించాడు. దాంతో భారత జట్టులోకి పునరాగమనం చేశాడు.

ఫినిషర్‌గా టీ20 ప్రపంచకప్‌ 2022 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్న దినేష్ కార్తీక్‌.. అంచనాలకు తగ్గట్టు రాణించడంలో విఫలమయ్యాడు.
కీలక మ్యాచ్‌లలో సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమవడంతో దినేష్ పై విమర్శల వర్షం కురిసింది. దానితో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కార్తీక్‌ను బీసీసీఐ సెలక్టర్లు పక్కన పెట్టారు. వన్డే ప్రపంచకప్‌ 2023 సన్నాహాకాల్లో భాగంగా భారత్‌ వచ్చే రోజుల్లో ఎక్కువగా వన్డే సిరీస్‌లు ఆడనుంది. కాబట్టి దినేష్ కార్తీక్‌ కెరీర్‌ దాదాపు ముగిసినట్టే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌కు డీకే గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా కార్తీక్‌ పోస్ట్‌ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘భారత్ తరపున టీ20 ప్రపంచకప్‌ ఆడాలనే లక్ష్యం కోసం చాలా చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నా కల నెరవేరింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. టీ20 ప్రపంచకప్‌ 2022 టోర్నీలో మేము విజయం సాధించకపోవచ్చు. కానీ ఎన్నో జ్ఞాపకాలు నా జీవితంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయి. నాకు మద్దతుగా నిలిచిన నా సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని వీడియోలో దినేష్ కార్తీక్‌ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: నోరు మూసుకుని ఫొటో.. ప్రపంచకప్ లో జర్మనీ జట్టు నిరసన