Site icon Prime9

BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా సెలెక్షన్ కమిటీపై వేటు

bcci-sacked-senior-selection-committee-members

bcci-sacked-senior-selection-committee-members

BCCI: ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీస్ లో టీమిండియా ఘోర పరాభవం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇటు క్రికెట్ లవర్స్ తో పాటు దేశప్రజలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టులో కీలకమార్పులు ఉంటాయని అంతా భావించగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సహా సెలెక్షన్ కమిటీ మొత్తంపై వేటు వేసింది.

అంతేకాకుండా, వెంటనే కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెలెక్టర్లు కావలెను అంటూ బీసీసీఐ ప్రకటనలో పేర్కొనింది. అందుకోసం కొన్ని అర్హతలు కూడా నిర్దేశించింది. కనీసం 7 టెస్టు మ్యాచ్ లు కానీ, కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు కానీ, లేక 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన వారు ఈ పోస్టులకు అర్హులని వివరించింది. అంతేకాదు ఆట నుంచి ఐదేళ్ల కిందటే రిటైరై ఉండాలని, మరే ఇతర క్రికెట్ కమిటీల్లో సభ్యులై ఉండకూడదని బీసీసీఐ తెలిపింది. నవంబరు 28వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఈ దరఖాస్తులు సమర్పించాలని బీసీసీఐ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: ఫిఫాప్రపంచ కప్‌.. స్టేడియంలలో బీర్ల అమ్మకాలను నిషేధించిన ఖతార్

Exit mobile version
Skip to toolbar