BCCI: బీసీసీఐకి గిన్నిస్ బుక్ రికార్డ్

ఐపీఎల్ నిర్వహణ సంస్థ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను సాధించింది. బీసీసీఐ నిర్వహించిన ఓ టీ20 మ్యాచ్ కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరుకావడం వల్ల గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.

BCCI: దేశంలోనే జరిగే ఐపీఎల్ మ్యాచ్ ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంక క్రికెట్ అభిమానులకు అయితే ఐపీఎల్ వస్తే పండుగ అనే చెప్పవచ్చు. అలాంటి ఐపీఎల్ లో జరిగిన ఓ మ్యాచ్ ఏకంగా గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకుంది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వహణ సంస్థ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను సాధించింది. బీసీసీఐ నిర్వహించిన ఓ టీ20 మ్యాచ్ కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరుకావడం వల్ల గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.

ఐపీఎల్-2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. గత మే 29న ఈ మ్యాచ్ జరగ్గా, అక్షరాలా 1,01,566 మంది ఈ మ్యాచ్ చూసేందుకు హాజరయ్యారు. కాగా ఇప్పటివరకు ఓ క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఇంత మొత్తంలో అభిమానులు తరలిరావడం ఇదే. దానితో ఈ రికార్డును గిన్నిస్ బుక్ యాజమాన్యం గుర్తించి అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధి నుంచి బీసీసీఐ కార్యదర్శి జై షా ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.

ఇదీ చదవండి: ఫిట్ నెస్ కోసం బుమ్రా కసరత్తులు.. వీడియో వైరల్