Site icon Prime9

Lionel Messi: వివాదాస్పదమైన మెస్సీ ప్రవర్తన.. బాక్సర్ హెచ్చరిక

a-warning-to-Lionel Messi in FIFA world cup 2022

a-warning-to-Lionel Messi in FIFA world cup 2022

Lionel Messi: ఫిఫా ప్రపంచకప్ వేదికగా ఎన్నో వింతలు విచిత్రాలతో పాటు వివాదాలు అల్లర్లు కూడా చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఈ సాకర్ టోర్నీ వేదికగా ఎంతో మంది ప్రజలు, ప్లేయర్లు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ చేసిన ఓపని ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది.

మొదటి మ్యాచ్ లో సౌదీ చేతిలో ఓడిపోయిన మెస్సీ సేనకు మెక్సికోపై విజయంతో అర్జెంటీనా జట్టుకు పెద్ద ఊరట లభించింది. ఈ నేపథ్యంలోనే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆ టీమ్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అందులో తమ జాతీయ జెండా, జెర్సీని మెస్సీ అవమానించాడని మెక్సికో బాక్సర్‌ సౌల్‌ కనేలో అల్వరజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మెస్సీ.. మా జెండా, జెర్సీతో ఫ్లోర్‌ తుడుస్తున్నాడు’అని ట్వీట్‌ చేశాడు. తాము అర్జెంటీనాను ఎలా గౌరవిస్తామో.. వారు కూడా అలాగే వ్యవహరించాలని సూచించాడు. అంతటితో ఆగకుండా మెస్సీని హెచ్చరించాడు. ‘అతడు నా చేతికి దొరక్కూడదని దేవుడిని ప్రార్థిస్తే మంచిది’ అని ట్వీట్‌ చేశాడు. ఇలా మెస్సీ మెక్సికో జెండాతో చేసిన పనికి పలువురు మెక్సికన్లు ఫైర్ అవుతున్నారు.

ఇదీ చదవండి: నోరు మూసుకుని ఫొటో.. ప్రపంచకప్ లో జర్మనీ జట్టు నిరసన

Exit mobile version