Site icon Prime9

Telangana Congress: నానాటికీ దిగజరుతున్న కాంగ్రెస్ పరిస్థితి.. హుజూరాబాద్ ఉప ఎన్నికతో పోలిస్తే బెటర్..

Deteriorating condition of Congress in Telangana

Prime9Special: తాజాగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కొంత ట్విస్ట్ చోటుచేసుకొనింది. ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ను బాగా కుంగతీసింది. గుడ్డిలో మెల్లన్నట్లుగా హుజూరాబాద్ ఉప ఎన్నికతో పోలిస్తే మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఓటు శాతం పెరిగింది. 2014లో తెరాస పార్టీ అభ్యర్ధి కూసుగుంట్ల ప్రభాకర రెడ్డి తన సమీఫ ఇండిపెండెంట్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిపై గెలుపును అందుకొన్నారు. ఆ సమయంలో స్రవంతికి 27441 ఓట్లను పోలైనాయి. అనంతరం 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సమీప తెరాస పార్టీ అభ్యర్ధి ప్రభాకర రెడ్డిపై విజయాన్ని సాధించారు. ఆనాడు కాంగ్రెస్ అభ్యర్ధికి 96961 ఓట్లతో మునుగోడు ప్రజలు గెలుపును అందించారు. అనంతరం జరిగిన రాజకీయాల నేపథ్యంలో నేటి ఉప ఎన్నికలో పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు. గెలుపు తెరాస అభ్యర్ధిని వరించగా రెండువ స్థానంలో భాజపా నిలబడింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి దిగజారి ఆ పార్టీ అభ్యర్ధికి డిపాజిట్ కూడా దక్కలేదు.

2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పాల్వయి స్రవంతి అప్పట్లో 27441 ఓట్లు సాధించగా, నేటి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆమెకు కేవలం 23906 ఓట్లకు మాత్రమే రావడంతో అందరిని విస్మయానికి గురిచేసింది. ఇది ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే పాల్వాయి స్రవంతి రాజకీయ కుటుంబం నుండి వచ్చారు. ఆమె తండ్రి గోవర్ధన రెడ్డి 5 పర్యాయాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. వ్యక్తిగత రాజకీయ చరిత్ర, సుదీర్గ పార్టీగా పేరొందిన కాంగ్రెస్ చరిత్రలు రెండూ కలిపిన్నప్పటికి తాజా మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్దగా ఓట్ల పడలేదు. సరికదా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశలపై పెద్ద క్వశ్చన మార్క్ ను తెచ్చిపెట్టుకొనింది. అయితే ఒక్క అంశం కాంగ్రెస్ కు ఆశలదీపంలో విహరించేలా చేసింది. 2021న హుజూరాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 1.46 శాతం ఓట్లు పోలయ్యాయి. మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం ఆ పార్టీకి 10.58 శాతం ఓట్లు రావడం కొంతమేర ఆ పార్టీకి ఉపశమనం కల్గించే అంశంగా చెప్పవచ్చు.

మునుగోడు ఉప ఎన్నికల్లో భాజపా, తెరాస పార్టీలు భారీగానే స్కెచ్ వేశాయి. దీంతో కాంగ్రెస్ పరిస్ధితి రోజు రోజుకు దిగజారిపోతుంది. తెలంగాణ ఆవిర్భాంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్ పాత్ర ఎంతో కీలకం. స్వయానా నేటి సీఎం కేసిఆర్ ఆ మాటలను అప్పట్లో పేర్కొన్నారు. అయితే అనంతరం చోటుచేసుకొన్న రాజకీయాల నేపథ్యంలో కేసిఆర్ కాంగ్రెస్ కు జలక్ ఇచ్చారు. ఉద్యమ వాతావరణం పూర్తిగా తన పార్టీకి ఉండాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మట్టికరిపించేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు.

2014, 2018లో కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేను తన పార్టీలోకి చేర్చుకొని కాంగ్రెస్ క్యేడర్ ను సన్నగిల్లేలా చేసి మరింత పట్టును సాధించారు. ఇదే క్రమంలో తెలంగాణలో భాజపా క్రమీప బలపడుతూ కాంగ్రెస్ ను వెనక్కి తోసి నేడు అధికార పార్టీ తెరాస తర్వాత స్థానంలో ఆ పార్టీ ఉండడం గమనార్హం. ఇటు భాజపా, అటు తెరాస పార్టీ నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్ ను మటుమాయం చేసేందుకు చేసిన ప్రయత్నాలు దాదాపుగా విజయవంతం అయ్యాయి. ఈ విషయం మునుగోడు ఉప ఎన్నికల్లో మరింత తేటతెల్లమైంది.

మునుగోడు నియోజకవర్గంలో జరిగిన గత ఎన్నికల్లో 1967 నుండి 2022 వరకు 13సార్లు అసెంబ్లీ ఎన్నికలు చోటుచేసుకొన్నాయి. ఒక్క పర్యాయం మాత్రం ఎమ్మెల్యే రాజీనామాతో ఉప ఎన్నికలు చోటుచేసుకొన్నాయి. 6 పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్ధులు మునుగోడు శాసనసభ్యులుగా ఎన్నికైనారు. తర్వాత స్థానంలో కమ్యూనిస్ట్ పార్టీలు 5 పర్యాయాలు విజయాలను సాధించివున్నారు. రెండు పర్యాయాలు తెరాస పార్టీ విజయం సాధించింది. అందులో తాజాగా చేపట్టిన ఉప ఎన్నిక కూడా ఉంది.

ఇది కూడా చదవండి: Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికల హోరా హోరీ ఫలితాలు రౌండ్ల వారీగా

Exit mobile version