Site icon Prime9

Kapu Leaders Meeting: కాపు నేతల కీలక సమావేశం.. మరోమారు పవన్ టార్గెట్ కానున్నారా..?

kapu leaders meeting in Rajahmundry

kapu leaders meeting in Rajahmundry

 Kapu Leaders Meeting: ఏపీలో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఆదివారం నాడు జనసేన పీఏసీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ వైసీపీ నేతలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా నేడు అధికార వైసీపీలో ఉన్న కాపు నేతలంతా రాజమండ్రిలో కీలక భేటీ కానున్నారు. అయితే ఈ సమావేశంలో వారంతా ఏం చర్చిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చిన పలు సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌నే టార్గెట్ చేసి.. ప్యాకేజ్ స్టార్ అంటూ ఎద్దేవా చేస్తుంటారు. దానికి ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై మాటల తూటాలు పేల్చుతూ విరుచుకుపడుతున్నారు. ఇదివరకటి కంటే కొంచెం డోస్ పెంచి పరుష పదజాలంతో వారిపై విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పవచ్చు. మరి దానికి ప్రతి వ్యూహంగా పవన్ కల్యాన్ ను ఏవిధంగా మాటలతో ఢీకొట్టాలన్న అంశంపై కూడా ఈ కీలక సమావేశంలో అంతర్గత చర్చ కానుందని తెలుస్తోంది. మరియు కాపులకు వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ఈ సమావేశం ప్రధాన అజెండాగా తెలుస్తోంది. దీనికి సంబందించి రాష్ట్రంలోని కీలక పదవుల్లో ఉన్న కాపు నేతలైన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు గుడివాడ అమర్ నాథ్, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇలా అనేక మంది కీలక నాయకులంతా ఇవాళ రాజమండ్రి తరలిరానున్నారు.

కాపు సామాజిక వర్గ సమస్యలు అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలను కూడా చర్చించనున్నట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్ అమలు, కాపులకు మరింత సంక్షేమం అందించే దిశగా ప్రణాళిక, కాపునేస్తం అమలు, కాపు విద్యార్థులకు ప్రభుత్వ తోడ్పాటు తదితర అంశాలతోపాటు నామినేటెడ్ పదవుల్లో ఉన్న కాపు నేతల ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చ కొనసాగుతుంది.

ఇదీ చదవండి: జనసేన పీఏసీ సమావేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పేర్నినాని

Exit mobile version