Site icon Prime9

Rahul Gandhi: భారత్ జోడో యాత్రను ఆపే శక్తి ఎవరికీ లేదు- రాహుల్ గాంధీ

rahul gandhi speech in shad nagar telangana

rahul gandhi speech in shad nagar telangana

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విశేష జనాదరణ పొందుతుంది. తెలంగాణలో 5వ రోజు భారత్ జోడో యాత్ర నిర్విఘ్నంగా జరిగింది. జడ్చర్ల నుంచి పాదయాత్ర ద్వారా షాద్ నగర్ చేరుకున్న రాహుల్ అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

భారత్ జోడో యాత్రలో అందరి మాటలు వింటున్నామని, రైతులు, మహిళలు, యువత తమతో కలిసి నడుస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటు విమర్శులు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, టీఆర్ఎస్ లు ప్రజల గొంతు నొక్కేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా చేస్తున్న అక్రమాలను కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ పోర్టల్ ను రద్దు చేస్తామని ఆయన తెలిపారు. భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బీజేపీ, టీఆర్ఎస్ లు చదువుకున్న యువకులను చిన్నచూపు చూస్తున్నాయని ఆయన ఆగ్రహించారు. తెలంగాణలో విద్యావ్యవస్థ ప్రైవేటు పరమైందని యువకులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. చదువుకున్న యువకులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొరియర్ బాయ్స్, డెలివరీ బాయ్స్, కూలీ వ్యక్తులుగా చేస్తున్నాయంటూ ఆయన ఆరోపించారు. భారత్ జోడో యాత్రను నిర్విఘ్నంగా కొనసాగిస్తామని ఈ యాత్రను ఆపే శక్తి ఎవరికీ లేదని ఆయన తెలిపారు. ఎండైనా, వానైనా ఈ యాత్ర కాశ్మీర్ వరకు చేరి తీరుతుందని ఆయన పేర్కొన్నారు. చేనేత పనులు, హ్యాండీక్రాఫ్ట్ ల జీఎస్టీపై కాంపెన్సేషన్ ఇస్తామని ఆయన తెలిపారు. నోట్ల రద్దుతో నరేంద్ర మోదీ చిరువ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా పరుగు తీసిన రాహుల్.. జోడో యాత్రలో చిత్ర విచిత్రాలు

Exit mobile version