Site icon Prime9

Jodo Yatra: రాహుల్ గాంధీకి తమిళ యువతితో పెళ్లి!… జోడో యాత్రలో ఫన్నీ సన్నివేశం..!

Rahul Gandhi marriage proposal in Jodo yatra

Rahul Gandhi marriage proposal in Jodo yatra

 Jodo Yatra: తమిళనాడులోని మార్తాండంలో శనివారం నాడు రాహుల్‌ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో యాత్ర జరిగింది. అయితే ఈ యాత్రలో ఓ ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. మీరు అంగీకరిస్తే మేము మీకు పెళ్లిచేస్తాం అంటూ తమిళ మహిళలు రాహుల్ ని అడిగారు. దానికి ఆయన ఏం సమాధానం చెప్పారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యండి.

దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కాగా శనివారం నాడు తమిళనాడులో జోడో యాత్ర చేపట్టిన రాహుల్ ఉదయం కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలై.. మధ్యాహ్నం అదే జిల్లా మార్తాండం ప్రాంతంలో రాహుల్ భోజన విరామం తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూలీలతో కాంగ్రెస్ పార్టీ యువ సారథి రాహుల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సంపాదన, కుటుంబ స్థితిగతులు, తీసుకురావాల్సిన మార్పు వంటి వివిధ అంశాలపై ఉపాధి కూలీ మహిళలతో రాహుల్ ముచ్చటించారు. ఇదిలా ఉండగా మాటల మధ్యలో ఓ మహిళ రాహుల్‌ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. మీకు తమిళనాడు అంటే ప్రత్యేక అభిమానం అని మాకు తెలుసు.. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం అంటూ ఓ మహిళ రాహుల్‌ గాంధీతో అన్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఆ సమయంలో రాహుల్‌ చాలా ఉత్సాహంగా కనిపించినట్లు ఆయన చెప్పారు. ఆ సన్నివేశానికి సంబంధించిన రెండు ఫొటోలను కూడా ట్వీట్‌కు జత చేసి పోస్ట్ చేశారు జైరాం రమేష్.

మరోవైపు తెలంగాణలోని మేడ్‌పల్లి గ్రామం నుంచి వ్యక్తిగతంగా వందల కిలోమీటర్లు ప్రయాణించి ఊసయ్య అనే వ్యక్తి రాహుల్ జోడో యాత్రకు వెళ్లి తమిళనాడులో ఆయనను కలిశారు. కాగా శనివారం సాయంత్రం జోడో యాత్ర కేరళలోకి ప్రవేశించింది. కేరళలో 18 రోజుల పాటు కార్యక్రమం ఉంటుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు.

ఇదీ చదవండి: Bharat Jodo Yatra: యేసు మాత్రమే నిజమైన దేవుడు.. రాహుల్ గాంధీతో పాస్టర్ సంభాషణ

Exit mobile version