Hyderabad: మేమే శాశ్వతం, మాదే రాజ్యం అనే ధోరణిలో వైకాపా నేతలు రెచ్చిపోతున్నారని, అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యుడు కొణిదెల నాగబాబు హెచ్చరించారు. హైదరాబాదులోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగబాబు ఈ విధంగా స్పందించారు.
తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం రంగాపూర్ కు చెందిన జనసేన కార్యకర్త నాగరాజు ఇటీవల మరణించారు. అయితే అతని పేరుతో జనసేన పార్టీ ప్రమాద భీమా చేసివున్నారు. ఈ క్రమంలో రూ. 5లక్షల రూపాయల చెక్కును నాగరాజు కుటుంబసభ్యులకు నాగబాబు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలను కాపాడుకొవడంలో పవన్ కల్యాణ్ ముందుంటారన్నారు. అనుకోని పరిస్ధితుల్లో జనసేన సైనికులకు ఆపద సంభవిస్తే ఆదుకొనేందుకు పవన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. అందుకు నిదర్శనంగా ఇటీవల విశాఖపట్నంలో వీర మహిళలు, జన సైనికుల పై వైకాపా అనుసరించిన విధానాన్ని పవన్ తిప్పి కొట్టడాన్ని ఉదాహరణంగా చెప్పుకొచ్చారు.
ఏపీలో వైకాపా పార్టీ గూండాయిజాన్ని పెంచి పోషిస్తుందని దుయ్యబట్టారు. త్వరలో వైకాపాను ఇంటికి పంపేందులో ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ మనో ధైర్యాన్ని కోల్పోవద్దని వ్యాఖ్యానించారు. నాగబాబుతో పాటు నేతలు శంకర్ గౌడ్, వంగా లక్ష్మణ్ గౌడ్, మండపాక కావ్య, రాజలింగం, ఉదయ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Junior Doctors Strike: ఏపీ ప్రభుత్వానికి జూడాల సెగ.. సమ్మెకు దిగనున్న జూనియర్ డాక్టర్లు