Site icon Prime9

Perni Nani: అలా చేస్తే “ప్యాకేజీ స్టార్” మాటను వెనక్కి తీసుకుంటాం- పేర్నినాని సవాల్

perni nani comment on pawan

perni nani comment on pawan

Perni Nani: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ మంగళగిరి పార్టీ కార్యాలయం వేదికగా వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పేర్నినాని ఘాటుగా స్పందించారు. నిన్ను సోదరా అంటేనే నీకు అంత కాలితే వైసీపీ నేతలను అరేయ్, ఓరేయ్, గుండాలు, సన్నాసులు అంటుంటే మాకెలా ఉండాలి అంటూ విమర్శలు గుప్పించారు.

వైసీపీలో లేని గూండాలను పవన్ కొట్టే అవకాశం లేదని పేర్నినాని ఎద్దేవా చేశారు. పార్టీ పెట్టుకుని వేరే పార్టీకి ఓటు వేయమనడం ప్యాకేజీ కోసం కాదా? అంటూ పవన్ను పేర్నినాని ప్రశ్నించారు. ఒకానొక టైంలో బీజేపీ, మోదీని తిట్టిన పవన్, నోరు తడి ఆరకముందే వాళ్లతో జతకట్టారని పేర్నినాని ఆరోపించారు. పవన్‌కు దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీచెయ్యాలని పేర్నినాని సవాల్ విసిరారు. పవన్ కుల రాజకీయాలు చేస్తున్నారు అంటూ పేర్నినాని విమర్శించారు. 175కు 175 స్థానాల్లో పోటీ చేస్తే ప్యాకేజీ స్టార్ అనే వ్యాఖ్యలను తాము వెనక్కి తీసుకుంటామని పేర్నినాని అన్నారు. బీజేపీతో పవన్ తెగదెంపులు చేసుకుంటున్నారని, ఇకపై రాష్ట్ర ముఖచిత్రం మారబోతుంది అంటే బీజేపీని వదిలి టీడీపీలోకి వెళ్లడమేనంటూ ఆయన ఆరోపించారు. మరి దీనిపై జనసేనాని మరియు జనసైనికులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇదీ చదవండి: భాష రాదనుకొంటే పొరపాటు.. వైకాపా శ్రేణులుకు పవన్ హెచ్చరిక

 

Exit mobile version