Andhra Pradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీ ప్రజలకు పార్లమెంటులో చేసిన చట్టాలు అందలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కులం, మతం, భాష, ఆహార, వేషధారణల ఆధారంగా భారతీయులను ఒకరికొకరు ఇరకాటంలో పెట్టే ప్రయత్నం సాగుతున్న నేటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేపట్టింది.
ఈ క్రమంలో నాలుగు రోజుల పాటు సాగిన పాదయాత్ర ఏపీలో పూర్తి చేసుకొనింది. ఏపీ పాదయాత్రలో ప్రజలు చూపిన ఆదరణకు ధన్యవాదాలు తెలుపుతూ రాహుల్ గాంధీ ఏపీ ప్రజలనుద్ధేశించి లెటరు వ్రాశారు. లెటరులో పొందుపరిచిన అంశాలమేరకు, తమిళనాడు నుండి కశ్మీర్ వరకు తలపెట్టిన పాదయాత్ర ఇప్పటివరకు సాగిన రాష్ట్రాల్లో ప్రజలను ప్రభావితం చేస్తున్న పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రాహుల్ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు ప్రభుత్వ రంగ హోదా కొనుసాగింపుకే తన సమర్ధనగా తెలిపారు. ఏపీ ప్రభుత్వం పంచాయితీ రాజ్ వ్యవస్ధను నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు.
2014లో పార్లమెంటులో ఏపీ ప్రజలకు చేసిన వాగ్ధానాలు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. వ్యక్తులు, పార్టీ చేసిన హామీలు కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పార్లమెంటు చేసిన చట్టాలుగా తెలిపారు. ఈ హామీలు పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత పాలకులదే కాని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రాహుల్ ఆరోపించారు. ఏపీ గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉందన్నారు. పూర్వ స్థానానికి చేరుకోవడానికి మేము చేయగలిగినదంతా చేయాలని నిర్ణయించుకున్నట్లు లెటరులో పొందుపరిచారు.
భారత్ జోడో యాత్రలో ఆకాశాన్నంటుతున్న ధరలు, నిరుద్యోగం కారణంగా ఏర్పడిన అసమానమైన ఆర్థిక సంక్షోభం, రాజకీయ, ఆర్థిక అధికారం కొద్దిమంది చేతుల్లో పెరగడం వంటివన్నీ తీవ్ర ఆందోళన కలిగించే అంశాలను గుర్తించిన్నట్లు రాహుల్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Mulugu MLA Seethakka: భాజపా ప్రజల్లో విషపు మొక్కలు చిమ్ముతోంది…రాహుల్ పాదయాత్రలో సీతక్క