Site icon Prime9

Pawan Kalyan: నన్ను నమ్మండి.. ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తా- పవన్

pawan-kalyan-speech-in-vizianagaram

pawan-kalyan-speech-in-vizianagaram

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఉత్తరాంధ్ర ప్రజానీకం ఆయనకు అడుగడుగునా బ్రహ్మ రథం పట్టారు. విజయనగరం జిల్లా గుంకలాంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం పేరుతో రూ. 12 వేల కోట్ల అవినీతి జరిగిందని పవన్ ఆరోపించారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ మోసాన్ని ప్రజలంతా గుర్తించాలని.. ఉత్తరాంధ్రులకు బలమైన రాజకీయ అధికారం దక్కాలని ఆయన ఆకాంక్షించారు. జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తామనని వ్యాఖ్యానించారు. యువత తమ భవిష్యత్తు కోసం నన్ను నమ్మంది నాపై నమ్మకం ఉంచండి అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దాం రోడ్డే వెయ్యని ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా అభివృద్ధి చేస్తుందంటూ ఆయన అధికార వైసీపీపై మండిపడ్డాడు.

రాష్ట్ర భవిష్యత్‌ కోసం తనను నమ్మాలని.. తనపై నమ్మకం ఉంచితే గూండాలతో పోరాడేందుకు తాను సిద్ధమని ఆయన పిలుపునిచ్చారు. మత్స్యకారులు ఉపాధి కోసం గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని.. జనసేన అధికారంలోకి వస్తే ఇక్కడే జెట్టీలు నిర్మించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర జనసైనికులు ధైర్యంగా పోరాడాలని అవినీతి అక్రమాలను బలంగా ఎదుర్కోవాలని సూచించారు. పోలీసులు కేసులు పెడితే మీతో పాటు నేనూ జైలుకు వస్తానని పవన్ కళ్యాణ్ వారికి భరోసా కల్పించారు.

ఇదీ చదవండి

Exit mobile version