Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో అధికారం వారికి ఇష్టారాజ్యంగా మారింది. అసెంబ్లీ, ప్రజా వేదికలు వారికి సొంత నిలయాలుగా మారాయి. మాటలు తూలుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి మేరుగు నాగార్జున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాలుక కోస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది కూడా నా కుటుంబసభ్యుల పై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మీరు నిమ్మకు నీరెత్తి వున్నట్లు వున్నారు అని సీఎం జగన్ అన్న మరుసటి రోజే మాట్లాడిన మంత్రి మాటలు ఎపిలో హాట్ టాపిక్ గా మారాయి.
పౌరులు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్గిస్తే కేసులు నమోదు చేస్తామంటూనే అధికార మదంతో నోటికి ఇష్టం మొచ్చిన్నట్లు మంత్రి మాట్లాడిన మాటల్లో లోకేష్ చెబితే రాష్ట్ర మంత్రులను మార్చాలా అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇష్టమొచ్చినట్లు దూషిస్తున్నారని మండిపడ్డారు. పరిపాలనలో భాగంగా ఎలాంటి మార్పులైనా చేసుకునే అధికారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందన్నారు. ప్రతిపక్షాలకు భయపడతే మంత్రి పదవిలో ఉన్నా ఒకటే లేకపోయనా ఒకటేనని వ్యాఖ్యానించడం గమనార్హం. భయపడే మంత్రులు ఎవరున్నారో వారికే తెలియాలని వ్యాఖ్యానించారు.
సీఎం ఎస్సీలకు వ్యతిరేకి అంటున్న తెదేపా నేతల ఆరోపణలను మంత్రి మేరుగు నాగార్జున తిప్పికొట్టారు. జగనన్న గురించి మాట్లాడే నైతిక హక్కు లోకేష్ కు లేదన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని అంటున్నారని, ఆ రాజారెడ్డి దేశానికి ఆణిముత్యాలాంటి వ్యక్తులను అందించారని చెప్పుకొచ్చారు. నెల్లూరులో ఎస్సీలపై జరుగుతున్న దాడుల పై మంత్రి స్పందించారు. జాతీయ ఎస్సీ కమీషన్ వాళ్లు ఏమైనా దేవుళ్లా, వాళ్లు ఏపికి వచ్చి స్థానిక పరిస్ధితులను తెలుసుకోవాలంటూ మంత్రి పేర్కొనడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.