Site icon Prime9

TDP: కొడాలి దిష్టిబొమ్మకు అంత్యక్రియలు

Kodali effigy is cremated in the cemetery

Kodali effigy is cremated in the cemetery

Andhra Pradesh: నిత్యం మాజీ సీఎం చంద్రబాబు పై అనుచితంగా మాట్లాడే కొడాలి నానికి తెలుగు తమ్ముళ్లు షాకిస్తున్నారు. పలు చోట్ల కొడాలి నానిని తప్పుబడుతూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో కడపలో వినూత్నంగా మాజీ మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నిరసనకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కొడాలినాని మదమెక్కిన ఆంబోతులా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబం పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. కొడాలినాని పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సీఎం జగన్ తనకు మరోసారి మంత్రి పదవి ఇస్తాడనే చంద్రబాబు కుటుంబం పై నాని రెచ్చి పోతున్నాడని విమర్శలు గుప్పించారు.

Exit mobile version