MLC polls: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు స్థానాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల, స్థానిక సంస్థలకు పోలింగ్ జరుగుతోంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.
పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు.. (MLC polls)
ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ జరగనుంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మెుత్తం 10 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేయటానికి అధికారులు అనుమతి ఇస్తున్నారు. తెలంగాణలో మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 29,720 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
అందులో పురుషులు 15,472, స్త్రీలు 14,246, ఇతరులవి 2 ఓట్లు. 137 పోలింగ్ స్టేషన్లలో మహబూబ్ నగర్ జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్లు, నాగర్ కర్నూల్ లో 14, వనపర్తి 7, జోగులాంబ గద్వాల్ లో 11, నారాయణ పేట్ లో 5, రంగారెడ్డి జిల్లాలో 31, వికారాబాద్ లో 18, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 14, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు కాగా ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 137 పీఓలు, 137 ఏపీఓలు, 319 ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఈ నెల 16 న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఉంటుంది.