Site icon Prime9

Chandrababu: కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. పార్టీకి పూర్వవైభవం తేవడమే లక్ష్యం

chandrababu

chandrababu

Chandrababu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుండి మూడు రోజుల పాటు కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో తేదేపాకు పూర్వ వైభవం తీసుకరావడమే ధ్యేయంగా ఈ పర్యటన కొనసాగనుంది. చంద్రబాబు పర్యటనలో భాగంగా ఆయన రెండు రాత్రులు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో బస చేయనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి12 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం కోడుమూరు, కరివేముల, దేవనకొండ మీదుగా రోడ్డు మార్గంలో పత్తికొండకు చేరుకుని సాయంత్రం అక్కడ రోడ్డు షో నిర్వహించనున్నారు.

దానితర్వాత కోరమాండల్ ఫర్టిలైజర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రికి ఆదోనిలో చంద్రబాబు బస చేయనున్నారు. గురవారం పట్టణంలో రోడ్డు షో నిర్వహిస్తారు.
రాత్రికి కర్నూలులో బస చేయనున్న చంద్రబాబు శుక్రవారం నాడు పార్టీకి చెందిన జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తారు. కాగా బాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా తెదేపా నేతలు పరిశీలిస్తున్నారు. పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ కలిసిరావాలని జిల్లా ఇన్ ఛార్జి అమర్ నాథ్ రెడ్డి, జిల్లా తెదేపా రాష్ట్ర పరిశీలకులు ప్రభాకర్ చౌదరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

వైకాపా ప్రభుత్వం అరాచకాలు, సీఎం జగన్ అసమర్ధ పాలన, టీడీపీ నాయకులపై జరుగుతున్న దాడులు, రైతులు, వ్యాపారులు, సామాన్యుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రస్తావించనున్నారు. నిరుద్యోగ సమస్యలు, పెరిగిన ధరలు వీటిపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టనున్నారు. కాగా చంద్రబాబు పర్యటన పార్టీ శ్రేణులు, కర్నూలు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని, భరోసాను తీసుకొస్తుందని తెదేపా నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: రాజధాని తరలింపుకు రంగం సిద్దం చేస్తున్న సీఎం జగన్

Exit mobile version