Wamiqa Gabbi : వామికా గబ్బి.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తెలుగులో సుధీర్ బాబు హీరోగా నటించి ‘భలే మంచిరోజు’ చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా, అమ్మడు నటనకు మార్కులు బాగానే పడ్డాయి. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా, ఇతర భాషల్లో తరుచుగా అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతుంది ఈ భామ. ఇక తాజాగా ‘కుఫియా’అనే వెబ్ సిరీస్ లో నటించింది. టబు, అలీ ఫజల్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సిరీస్ లో వామిక నెక్స్ట్ లెవెల్లో రెచ్చిపోయింది. కేవలం నటనతోనే కాకుండా గ్లామర్ షో తో కూడా అదరగొట్టింది. ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.