Samantha : “సమంత”.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. “ఏ మాయ చేసావే” సినిమాతో తెలుగు తెరేకు పరిచయమైన సమంత ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకొని కెరీర్ ని సాగిస్తుంది. ఇక ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన “ఖుషి” లో నటించి మెప్పించింది. ప్రస్తుతం షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి వెకేషన్ లో ఉన్న ఈ భామ.. సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలతో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది.