Site icon Prime9

Godfather: సల్మాన్ ఖాన్ అభిమానుల అత్యుత్సాహం…పరుగులు తీసిన ప్రేక్షకులు

With the zeal of Salman Khan's fans...the audience ran away

With the zeal of Salman Khan's fans...the audience ran away

Salman khan: గాడ్ ఫాదర్ సినిమా చూస్తూ సల్మాన్ ఖాన్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టపాసులు పేల్చి అభిమాన హీరోకు జేజేలు పలికారు. దీంతో దేవుడా అనుకుంటూ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఒక్క ఉదుటన ధియేటర్ బయటకు పరుగులు తీసిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొనింది. ఆ ఘటన కాస్తా సోషల్ మీడియాలో హల్ చేశాయి.

మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కలసి నటించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రేక్షకుల నుండి మంచి టాక్ ను సంపాదించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర మాలేగావ్ లోని ఓ ధియేటర్ లో ‘గాడ్ ఫాదర్’ సినిమాను ప్రదర్శిస్తున్నారు. తార్ మార్, పాట స్క్రీన్ మీద రావడంతో ఒక్కసారిగా అభిమానుల్లో కిక్ తెప్పించింది. వెంట తెచ్చుకొన్న టపాసులను ధియేటర్ లోపలే పేల్చి హడావుడి చేశారు. దీంతో ఇదెక్కడి చోధ్యం రా బాబూ అంటూ కొంతమంది ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. ఆ ఘటన వీడియోలను నెట్టింటి తోసేసారు. ఇలాంటి సంఘటనలు ఒక్కోసారి ప్రాణాల మీదుకు తెస్తాయి జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ ప్రారంభమైనాయి.

గతంలో కూడా సల్మాన్ ఖాన్ నటించిన ‘అంతిమ్’ చిత్రం విడుదల సమయంలో కూడా అభిమానులు టపాసులు పేల్చి నానా యాగీ చేశారు. అప్పట్లో ఇది కరెక్ట్ కాదని సల్మాన్ ఖాన్ అభిమానులను హెచ్చరించాడు. అయినా తమ అభిమానానికి హద్దు లేదంటూ తాజాగా ‘గాడ్ ఫాదర్’ విషయంలోనూ టపాసులు పేల్చారు.

లూసిఫర్ రీమేక్ లో నిర్మించిన ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ ఖాన్ మసూం భాయ్ పాత్రలో ప్రత్యేక ఆకర్షగా నిలవడంతో బాలీవుడ్ లోనూ ‘గాడ్ ఫాదర్’ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

ఇది కూడా చదవండి: God Father: గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసా

Exit mobile version