Kaleshwaram: తెలంగాణకు ఊరట.. కాళేశ్వరంపై సుప్రీం కీలక నిర్ణయం

Kaleshwaram: కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు భారీ ఊరట లభించింది. ప్రాజెక్టు విషయంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు మూడో టీఎంసీ స్టేటస్ కో ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సవరించింది. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనం స్టేటస్‌ కో ఉత్తర్వులను తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం తీసుకునేలా సవరిస్తూ.. మూడో టీఎంసీ అనుమతుల విజ్ఞప్తుల పరిశీలనకు గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి అనుమతి ఇచ్చింది.

తుది ఉత్తర్వుల మేరకే అనుమతులు లోబడి ఉంటాయని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

ప్రాజెక్టు విషయంలో నష్టపరిహారం తీసుకొని భూములు ఇవ్వదలచుకున్న రైతులకు కూడా అనుమతి ఇచ్చినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కాళేశ్వరం మూడో టిఎంసీ కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంలో చెరుకు శ్రీనివాస రెడ్డి.. రైతులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

తుది తీర్పు వచ్చేలోగా అనుమతులపై గోదావరి బోర్డు, సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకునేలా స్టేటస్ కో ఆర్డర్ లో సవరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

ఈ మేరకు  తుది తీర్పుకు కట్టుబడి ఉంటామని సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం విన్నవించింది. రాజకీయ పరమైన కారణాలతోనే కాళేశ్వరం పనులకు అడ్డుపడుతున్నారని తెలంగాణ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది వైద్యనాదన్ వాదించారు.

గతంలో కాళేశ్వరం (Kaleshwaram) ఎత్తిపోతల ద్వారా ఏకకాలంలో నీటిని తరలించేందుకు చేపట్టిన కాల్వ భూసేకరణపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రెండు పర్యాయాలు భూములు కోల్పోయిన రైతులు తాజాగా మరోసారి భూములు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. పరిహార వ్యవహారం తేలాకే ఆలోచిస్తామని సుదీర్ఘ ఆందోళన చేపట్టారు.

 

ఇవి కూడా చదవండి:

ఇక వాల్తేరు ’విరాట్‘ ను చూడండి.. కింగ్ కోహ్లి బ్యాక్ ఇన్ యాక్షన్

‘శాకుంతలం’ ట్రైలర్.. కళ్లు చెదిరే విజువల్ వండర్ లో సమంత

నన్ను కార్నర్ చేసే సీన్ ఎవరికీ లేదు.. కానీ నా సినిమా రెండు రోజులు వాయిదా వేసుకున్నాను.. దిల్ రాజు

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news