Site icon Prime9

Indian Railways: ప్రతి మూడు రోజులకు ఓ రైల్వే ఉద్యోగిపై వేటువేస్తోన్న రైల్వేశాఖ

railways-removed-non-performer-employees every three days

railways-removed-non-performer-employees every three days

Indian Railways: అధికారి హోదాలో పనిచేస్తున్నా కదా అని రిలాక్స్ అవున్న ఉద్యోగులకు రైల్వేశాఖ షాక్ ఇస్తుంది. విధుల్లో అలసత్వం వహిస్తే ఇంటికి పంపించడం ఖాయమని స్పష్టం చేసింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే శాఖ ఇటీవల తమ ఉద్యోగులపై వేటు వేస్తోంది. గత 16 నెలలుగా ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగికి ఉద్వాసన పలుకుతుంది. తాజా సమాచారం ప్రకారం బుధవారం నాడు ఇద్దరు సీనియర్‌ గ్రేడ్‌ అధికారులపై రైల్వే శాఖ వేటు వేసినట్లు తెలుస్తోంది.

ఒకరు హైదరాబాద్‌లో రూ.5లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కగా, మరో అధికారి రాంచీలో రూ.3లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయినట్లు సంబంధిత రైల్వే వర్గాలు వెల్లడించాయి. కాగా, రైల్వే శాఖ 2021 జులై నుంచి ఇప్పటి వరకు 139 మంది ఉద్యోగులను బలవంతంగా స్వచ్చందంగా పదవి విరమణ చేయించి (వీఆర్‌ఎస్‌) ఇంటికి పంపించగా మరో 38 మంది ఉద్యోగులను విధుల నించి తొలగించనున్నట్లు రైల్వే  అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.

కేంద్ర రైల్వే మంత్రిగా 2021లో బాధ్యతలు తీసుకున్న తర్వాత అశ్వినీ వైష్ణవ్ ఉద్యోగులకు పలుమార్లు విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠినచర్యలు తప్పవని  హెచ్చరికలు జారీ చేశారు. విధినిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోయేది లేదని తేల్చిచెప్పారు. పనిచేయకుండా సంస్థకు భారంగా మారిన ఉద్యోగులను ఇంటికి పంపించేస్తామని చాలా సందర్భాలలో మంత్రి పేర్కొన్నట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను ప్రతి మూడు రోజులకు ఒకరిని విధుల నుంచి తొలగించేస్తున్నారు.

ఇదీ చదవండి: రేప్ సీన్ రివర్స్.. ఓ అబ్బాయిపై నలుగురు అమ్మాయిల అత్యాచారం

Exit mobile version