Site icon Prime9

Viral News: బతికొస్తుందంటూ.. మృతదేహం పక్కనే మూడు రోజులుగా ప్రార్థనలు

Medico dies as techie slits her throat in guntur district

Medico dies as techie slits her throat in guntur district

Viral News: జనరేషన్ మారుతున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొంతమంది ప్రజలు అంధ విశ్వాశాలను, మూఢనమ్మకాలను గుడ్డిగా ఫాలో అవుతున్నారు. మ‌నం ఎవ‌రిని ఎంత‌గా ప్రేమించినా.. ఆ వ్య‌క్తి మ‌న కన్నా ముందో వెనుకో చ‌నిపోక త‌ప్ప‌దు అనే నిజాన్ని మరచి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానా అంటే ఓ కుటుంబం చేసిన ఈ వింత పని చూస్తే షాక్ అవ్వాల్సిందే. చనిపోయిన వారు బతికొస్తారంటూ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా మూడురోజుల పాటు ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి డెడ్ బాడీకి అంత్యక్రియలు చేయించారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలోని మ‌దురైలో జ‌రిగింది.

వివరాల్లోకి వెళ్తే.. బాల‌కృష్ణ‌న్‌, మాల‌తి దంప‌తులు తమిళనాడు రాష్ట్రం మ‌దురైలోని ఎస్ఎస్ కాల‌నీలో నివ‌సిస్తున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు. బాల‌కృష్ణన్ ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో మేనేజ‌ర్‌గా ప‌ని చేస్తుండ‌గా.. కుమారులిద్ద‌రూ వైద్య విద్య చ‌దువుతున్నారు. కాగా ఇటీవ‌ల మాల‌తి అనారోగ్యానికి గురి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 8న మృతిచెందింది.
అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా మృత‌దేహాన్ని ఇంటికి తీసుకువ‌చ్చి, ఫ్రీజ‌ర్ బాక్స్‌లో ఉంచారు. అయితే ఇంటి నుంచి దుర్వాస‌న వ‌స్తుండ‌డంతో స్థానికులు బాల‌కృష్ణన్ ఇంటికి వెళ్లి చూశారు. అక్క‌డ మాల‌తి కుటుంబీకులంతా ఆమె మృత‌దేహం ప‌క్క‌న కూర్చుని ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. ఇలా చేస్తే మాల‌తి బ‌తికివస్తుందని స్థానికుల‌తో వారు చెప్పారు.
ఈ విషయం విన్న స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కు వెళ్లి మృత‌దేహాన్ని తరలించే ప్రయత్నం చేశారు. కాగా దాన్ని కుటుంబీకులంతా అడ్డుకుని మృతదేహాన్ని తీసుకెళ్తే తామంతా ఆత్మహత్య చేసుకుంటామని పోలీసులను బెదిరించారు. పోలీసులు వారికి ఎన్ని విధాలుగా నచ్చజెప్పాలని చూసినా వికపోవడంతో అందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. దానితో దారిలోకి వచ్చిన బాలకృష్ణన్ కుటుంబసభ్యులతో కలిసి పోలీసులు మృత‌దేహాన్ని తిరునెల్వేలి జిల్లా కళకాట్టికి తీసుకువెళ్లి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

ఇదీ చదవండి: రైలు కింద పడినా బతికేశాడు.. అదృష్టం అంటే ఇదినేమో..!

Exit mobile version