Site icon Prime9

PM Modi : మాదిగల విశ్వరూప మహాసభకు హాజరుకానున్న ప్రధాని మోదీ.. ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేస్తారా ?

pm modi going to attend madiga viswarupa mahasabha at hyderabad

pm modi going to attend madiga viswarupa mahasabha at hyderabad

PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బీసీ ఆత్మీయ సభలో పాల్గొన్నారు మోదీ. ఇక ఈ క్రమంలోనే ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే మాదిగ, మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి హాజరుకానున్నారు.

సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేరుగా పరేడ్ గ్రౌండ్‌కు వెళతారు. సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు పరేడ్ గ్రౌండ్ లో జరిగే సభలో పాల్గొంటారు. సభ అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఇప్పటికే మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

తాము అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. పదేళ్లుగా అధికారంలో ఉన్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. దీనిపై మాదిగ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీంతో ఎన్నికల సమయంలో అత్యధిక ఓట్లు కలిగిన మాదిగ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో భాగంగానే మోదీ ఈ సభకు హాజరు అవుతున్నారని చర్చించుకుంటున్నారు. అయితే ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలనే డిమాండ్‌తో ఏర్పడిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాదాపు మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. 2000 సంవత్సరంలో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లను వర్గీకరించినప్పటికీ 2004 లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసింది. అప్పటి నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్గీకరణపై పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలను డిమాండ్‌ చేస్తోంది.

 

Exit mobile version
Skip to toolbar