Joshimath: జోషిమఠ్‌లో రోజురోజుకు కుంగిపోతున్న ఇళ్లు.. ప్రమాదకరమైన భవనాలను గుర్తించి నివాసితులను తరిస్తున్న అధికారులు

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగుతున్న నేపధ్యంలో అసురక్షితమైన మరియు ప్రమాదకరమైన భవనాలను గుర్తించారు.

  • Written By:
  • Publish Date - January 10, 2023 / 05:21 PM IST

Joshimath: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగుతున్న నేపధ్యంలో అసురక్షితమైన మరియు ప్రమాదకరమైన భవనాలను గుర్తించారు. వాటికి రెడ్ క్రాస్ (X) గుర్తు పెట్టారు. జోషిమఠ్‌(Joshimath)లోని మరిన్ని ఇళ్లు పగుళ్లు ఏర్పడడంతో ఎముకలు కొరికే ఈ చలికాలంలోనూ నివాసితులు తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది. వీరిని ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు.

చమోలీ ప్రాంతంలో 600 ఇళ్లకు పగుళ్లు..

చమోలి జిల్లా యంత్రాంగం 9 వార్డుల్లోని 600 భవనాలు పగుళ్లు ఏర్పడినట్లు, 82 కుటుంబాలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. జోషిమఠ్‌ను విపత్తు పీడిత ప్రాంతాలుగా ప్రకటించామని, జోషిమఠ్‌(Joshimath) మరియు సమీప ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలను నిషేధించామని చమోలీ డీఎం తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ జోషిమఠ్‌ను రక్షించడానికి ప్రతి ఒక్కరూ జట్టుగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంత పరిస్దితిని ప్రధాని నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారని అన్నారు.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం చమోలీ సేఫ్టీ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం అదనంగా రూ.11 కోట్లు విడుదల చేసింది. జోషిమఠ్ బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రవేశ ద్వారం. శతాబ్దాల క్రితం ఆది గురు శంకరాచార్య తపస్సు చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. జోషిమఠ్‌ తో భూమి కుంగడం మరియు దాని ప్రభావం గురించి “వేగవంతమైన అధ్యయనం” చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. మరి ఆ పవిత్ర కేత్రంలో ఏం జరుగుతుందో తెలియక స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

CCTV: హైదరాబాద్‌లో పిల్లిని ఎత్తుకుపోతున్న దొంగ.. CCTV ఫుటేజ్ వైరల్

Khammam Politics: ఖమ్మంలో ఊహించని ట్విస్ట్‌లు.. ఫిక్స్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పోతే పోనియండన్న కేసీఆర్

Constable Leave Letter: సార్ నా భార్య అలిగింది.. బుజ్జగించడానికి లీవ్ ఇవ్వండి

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/