Site icon Prime9

Asaduddin Owaisi: వందేభారత్ రైలులో ప్రయాణించిన మజ్లిస్ పార్టీ అధినేత ఓవైసీ.. రాళ్లు రువ్విన దుండగులు

Majlis Party chief Owaisi who traveled in Vande Bharat train was pelted with stones by thugs

Gujarat: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పై దాడి చేసిన తరహాలోనే గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో అదే ఓవైసీ పై గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పై రాళ్ల దాడి చేశారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న వాహనం రైలు కావడంతో ప్రమాదం తప్పింది. ఈమేరకు ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇతెహదుల్ ముసల్మాన్ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ తెలిపారు.

గుజరాత్ అహ్మదాబాద్ నుండి సూరత్ వెళ్లేందుకు ఓవైసీతో పాటు ఇతర నేతలు వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకొనింది. ఈ క్రమంలో ప్రయాణిస్తున్న రైలు పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఓవైసీ కూర్చున్న బోగీపై రాళ్లు రువ్వడంతో ఆ బోగీలోని అద్దాలు పగిలాయి. సూరత్ కు 25 కి.మీ దూరంలో వందే భారత్ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఘటన చోటుచేసుకొనింది.

అయితే సంఘటన పలు అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే వందే భారత్ రైలు స్పీడు దాదాపుగా 160కి.మీ మేర ఉంటుంది. అంత వేగంగా వెళ్లుతున్న సమయంలో అనుకొన్న భోగీ పై రాళ్లు విసరడం అనేది అంత ఆషామాషీ అంశం కాదు. దీని వెనుక రాజకీయ కుట్ర దాగివుందని అర్ధం అవుతుంది. గతంలో కూడా ఆయన పై దాడి చేసి ఓ పార్టీకి అధికారం చేజిక్కించకుండా ఓవైసీ తెలివిగా అక్కడి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇదే క్రమంలో గుజరాత్ ఎన్నికల్లో కూడా ఏదేని ప్లాన్ లో ఇలాంటి ఘటనలు జరిగాయా అని రాజకీయ పార్టీలు ఆరా తీస్తున్నాయి. అక్రమార్కులను తొక్కేస్తాం అంటున్న భాజపా ప్రభుత్వం ఈ ఘటన పై ఎలాంటి చర్యలు తీసుకోనుందో తెలియాలి.

ఇది కూడా చదవండి: SI Recruitment scam: జమ్మూ-కశ్మీర్ లో సబ్-ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్మెంట్ స్కాం.. నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ

Exit mobile version