Hemant Soren: జార్ఖండ్‌లో అధికార జెఎంఎం పార్టీ, దాని మిత్ర పక్షం కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌కు మకాం మార్చింది. బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుందన్న ఆందోళనతో తమ ఎమ్మెల్యేలను సరక్షిత ప్రాంతాలకు తరలించింది. కాగా ప్రతిపక్ష బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం, తాజాగా తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని తమ అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ జెఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసి తన ప్రభుత్వాన్ని కూలుస్తుందన్న ఆందోళనతో సోరెన్‌లో ఉంది.
మంగళవారం మధ్యాహ్నం సోరెన్ తన ఇంటి నుంచి రెండు బస్సుల్లో ఎమ్మెల్యేలను తీసుకొని రాంచీ విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి చార్టర్ట్ విమానంలో రాయ్‌పూర్‌కు వెళ్లి అక్కడి మే ఫెయిర్ రిసార్టులో బస చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. గత శనివారం నాడు కూడా సోరెన్ 43 ఎమ్మెల్యేలను తీసుకొని కుంతి రిసార్టుకు బయలు దేరారు.
కాగా హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి ఉంటూ గనుల కాంట్రాక్టు దక్కించుకోవడం పెద్దదుమారం రేగింది. ఎన్నికల కమిషన్ ఆయనపై అనర్హత వేటు వేస్తూ గవర్నర్‌కు సీల్డ్ కవర్‌లో సిఫారసు లేఖ రాసిపంపింది. అయితే బీజేపీ మాత్రం నైతిక బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తోంది.