Site icon Prime9

Tamilnadu: తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలు బంద్

heavy rainfall in tamilnadu

heavy rainfall in tamilnadu

Tamilnadu: తమిళనాడు రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో టెంపుల్ టైన్ లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చెన్నైలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షం కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రోజున 14 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. చెన్నైతో పాటు తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణీపేట్‌, వెల్లూరు, సాలెం నాగపట్నం తదితర జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గత 30 ఏళ్లలో ఇంతటి వర్షపాతం నమోదవడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరికొన్ని గంటలు తమిళనాడు, పుదుచ్ఛేరి వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇదీ చదవండి: మోదీతో జనసేనాని భేటీ.. అసలు అజెండా అదేనా..?

Exit mobile version