ED Raids: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో ఉదయం నుంచే సోదాలు మొదలయ్యాయి. హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్‌తో సహా 35 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో పలుసార్లు దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించిన ఈడీ మరోసారి సోదాలు చేస్తోంది..ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడు దీనేష్ఆరోరా నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సమీర్ మహేంద్రు ను ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సమీర్ మహేంద్రు ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సమీర్ మహేంద్రు ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు. అయితే మరో నాలుగు రోజుల పాటు కస్టడీని కోర్టు పెంచుతూ ఆదేశాలు జారీచేసింది. ఈ నాలుగు రోజుల పాటు ఈడీ అధికారులు మహేంద్రు నుండి కీలక సమాచారాన్నిరాబట్టే ప్రయత్నం చేయనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో హవాలా రూపంలో డబ్బులు చేతులు మారాయని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.ఈ విషయమై ఈడీ అధికారులు ఆరాతీస్తున్నారు. గతంలో కూడా హైద్రాబాద్ కేంద్రంగా ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్లై పేరును సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది.. హైద్రాబాద్ లోని ప్రముఖ ఆడిటర్ నివాసంలో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో సేకరించిన సమాచారం ఆదారంగా సెప్టెంబర్ 19వ తేదీన ప్రముఖ బిల్డర్ శ్రీనివాసరావు నివాసం, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు.ఈ సోదాల్లో కీలక సమాచారం సేకరించారు.