Site icon Prime9

DRDO Tests Air Missile: మరో కొత్త సాంకేతికత పై పట్టు

DRDO TESTS AIR MISSILE

DRDO TESTS AIR MISSILE

Odisha: దేశాన్ని రక్షించుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఇందుకోసం లక్షలాది మంది సైనికులు  నిరంతరం పహారా కాస్తుండడం ఒక వంతైతే, దేశ రక్షణకు సంబంధించిన సాంకేతిక, ఆయుధాలు, వాహనాలు, రాకెట్లు, మిస్సైల్స్ వంటి తయారీ కూడా ఎంతో కీలకం.

ఇందుకోసం దేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్ మెంటు ఆర్గనైజేషన్ (డిఆర్ డివో) నిత్యం నూతన సాంకేతికతను సైనికుల వడిలో చేరుస్తూ వారికి భరోసా ఇస్తుంటుంది. ఇదే తరహాలో తాజాగా క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ కు సంబంధించిన ఆరు విమానాలను శాస్త్రవేత్తలు పరిక్షించారు. నేడు (గురువారం) ఒడిశా తీరంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డిఆర్ డివో ప్రకటించింది. రక్షణకు సంబంధించిన వివిధ వ్యవస్ధల సామర్ధ్యాన్ని అంచనా వేసేందుకు ఎయిర్ మిస్సైల్స్ ఉపయోగపడనున్నాయి.

ప్రధానంగా ప్రత్యర్ధులకు సంబంధించిన వినాశక సాంకేతికతను గుర్తించేందుకు అంటే వైమానిక బెదిరింపులను అనుకరించే హై-స్పీడ్ వైమానిక లక్ష్యాలకు వ్యతిరేకంగా విమాన పరీక్షలు జరిగాయి. ఇప్పటికే శాస్త్రవేత్తలు మన దేశ రక్షణకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. తాజా ప్రయోగ పరిక్షలు మరింతగా ఉపయోగపడనున్నాయి

Exit mobile version