Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఈడీ రెండో ఛార్జ్ షీట్ లో ప్రముఖల పేర్లను ప్రస్తావించింది. ఇందులో ముఖ్యంగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేర్లను ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
మెుత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు
ఢిల్లీ లిక్కర్ స్కాం (Liquor Scam) లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఢిల్లీ సీఎం సహా.. ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లను ఈడీ ప్రస్తావించింది. వీరితో సహా.. మెుత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది.
ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు సహా.. 17 మందిపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ మద్యం కుంభకోణం నుంచి వచ్చిన నగదును.. ఆప్ గోవా ఎన్నికల ప్రచారానికి వాడుకుందని ఈడీ ఆరోపించింది. సాక్ష్యాలను ధ్వంసం చేసిన వారి పేరులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అలాగే విచారించిన జాబితాలో కవిత పేరును ఈడీ పేర్కొంది.
ఈ ఛార్జ్ షీట్ పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించాడు.
కేంద్ర ప్రభుత్వం కావాలనే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడితే.. ఈ కావాలని దాడులు చేస్తున్నారని విమర్శించారు.
ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేర్లు.
ఈడీ ఇప్పటివరకు 65 మందిని విచారించిన ఈడీ.
సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు ముడుపులు విజయ్ నాయర్ అందుకున్నట్లు ఆరోపణ.
సౌత్ గ్రూప్- ఆప్ లీడర్ల మధ్య ఒప్పందంలో భాగంగానే ఈ ముడుపులు.
ఇండో స్పిరిట్ లో సౌత్ గ్రూపులో 65% భాగస్వామ్యం ఇచ్చినట్లు ఆరోపణ.
సౌత్ గ్రూప్ లో సభ్యులుగా కవిత, శరత్ చంద్ర రెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మా గుంట రాఘవ.
సౌత్ గ్రూప్ ప్రతినిధులుగా అభిషేక్ బోయిన్ పల్లి, రామచంద్ర బుచ్చిబాబు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/