Site icon Prime9

Corona XXB Variant: కరోనా కొత్త వేరియంట్ మహా డేంజర్.. జర భద్రం..!

corona XXB variant in Maharashtra

corona XXB variant in Maharashtra

Corona XXB Variant: కరోనా ప్రభావం తగ్గిందనుకున్న ప్రతీ సారీ నేనున్నానంటూ ఎక్కడో దగ్గర తన ఉనికి చాటుకుంటూనే ఉంది కొవిడ్-19. కరోనా మహమ్మారి బెదడ ఇక ఉండదులే అనుకుంటూ జనజీవనం కుదుటపడుతున్న వేళ మరోసారి దాని విజృంభణను కొనసాగిస్తోంది. పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చిందనుకునే లోపే కరోనా మళ్లీ విస్తరిస్తోంది. దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉండగా పండుగ సీజన్ లో రోజువారీ కేసుల సంఖ్య పెరగడంతో పాటు మహారాష్ట్రలో కొత్త, అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి. దీనితో మహరాష్ట్ర ప్రజలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా వెలుగు చూసిన కరోనా వేరియంట్లలో అత్యంత ప్రమాదరక, వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్ఎక్స్ బీ అని నిపుణులు గుర్తించారు.

ఎక్కువ జన సాంద్రత కలిగిన ప్రాంతాలైన ముంబై, థానే, పూణే, రాయ్‌గడ్‌లోని పలు ప్రాంతాల్లో గత వారంలో ఈ వేరియంట్ వెలుగు చూటడం ఆందోళనను రేకెత్తించింది. అయితే ఈ నెల 10–16 తేదీల మధ్య కేసుల సంఖ్య 17.7 శాతానికి పైగా పెరిగినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది. ఎక్స్ఎక్స్ బీ వేరియంట్ ఇప్పటిదాకా 17 దేశాలకు వ్యాపించిందని, బీఏ 2.75, బీజే.1 సబ్-వేరియంట్‌ల కంటే దీని వృద్ధి ఎక్కువగా ఉందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. గత ఆరు నెలల్లో భారత దేశంలో దాదాపు 90 శాతం బీఏ .2.75 వల్ల, ఎక్స్ఎక్స్ బీ 7 శాతం కొత్త ఇన్‌ఫెక్షన్‌లు సంభవించాయని తేలింది.

ఎక్స్ఎక్స్ బీ స్పైక్ ప్రోటీన్ పై ఏడు ఉత్పరివర్తనాలను కలిగి ఉండడం వల్ల ఇది రోగనిరోధక వ్యవస్థను కూడా తప్పించుకుంటుందని తద్వారా దీని వ్యాప్తి రేటు భారీగా ఉందని నిపుణులు చెబుతున్నారు. వృద్ధులు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

ఇదీ చదవండి: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో యూకే.. తిండి మానేస్తున్న ప్రజలు..!

Exit mobile version