Site icon Prime9

CM KCR: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ.. ప్రకటించిన కేసీఆర్

kcr in nanded

kcr in nanded

CM KCR: దేశంలో వచ్చేది రైతు సర్కారే అని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన భారాస బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రైతులు అండగా ఉంటామనీ కేసీఆర్ హామీ ఇచ్చారు.

రైతుల తుపాన్‌ రాబోతోంది.. (CM KCR)

దేశంలో వచ్చేది రైతు సర్కారే అని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన భారాస బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రైతులు అండగా ఉంటామనీ కేసీఆర్ హామీ ఇచ్చారు. దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతోందని.. దాన్నెవరూ ఆపలేరని కేసీఆర్ అన్నారు. తెలంగాణ తరహా పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేస్తే మరోసారి ఇక్కడికి రానని అన్నారు. అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ పేరిట నాందేడ్‌ జిల్లాలోని లోహాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. రైతు బంధు, దళిత బంధు, 24 గంటల పాటు ఉచిత కరెంట్ అందిస్తున్నామని తెలిపారు. రైతు బీమాతో పాటు.. పూర్తిగా పంటను కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను భారాస లోకి ఆహ్వానించారు.

నేను భారతదేశ బిడ్డను- కేసీఆర్

బీఆర్ఎస్ సభకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అడ్డంకులు సృష్టించారని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ సీఎం కు మహారాష్ట్రంలో ఏం పని అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. నేను భారతదేశ బిడ్డనని.. తాను ఎక్కడికైన వెళ్లగలనని కేసీఆర్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిన పేదల బతుకులు మారలేదని కేసీఆర్ అన్నారు.

కాంగ్రెస్, భాజపాలతో మన బతుకులు మారలేదని.. అది భారాసతోనే సాధ్యమని కేసీఆర్ వివరించారు.

దేశంలో అవసరానికి మించి నీరు ఉన్న.. దానిని ఉపయోగించుకోవడంతో కాంగ్రెస్, భాజపాలు విఫలం అయ్యాయని కేసీఆర్ అన్నారు.

మహారాష్ట్రలో ఇప్పటికి దళితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలోనూ దళితబంధు అమలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

భాజపా ప్రభుత్వం మహారాష్ట్ర రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో నేతల మాటలకు మోసపోయామని కేసీఆర్‌ అన్నారు. రైతులు మోసపోకూడదనే అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.

ధర్మం మతంపేరుతో విడిపోతే.. రైతు ఆత్మహత్యలు ఆగబోవని చెప్పారు.

గతంలో నాందేడ్‌లో సభ పెట్టగానే రైతుల ఖాతాల్లో రూ.6 వేలు వేశారని, దీంతో భారాస సత్తా ఏంటో ప్రజలకు అర్థమైందని కేసీఆర్‌ అన్నారు.

స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి

భారాస పార్టీని మహారాష్ట్రలోనూ రిజిస్టర్‌ చేయించినట్లు కేసీఆర్‌ తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారాస పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలి. స్థానిక సంస్థల్లో భారాసాను గెలిపించండి.. మీ సమస్యలు పరిష్కరించి చూపిస్తా అని కేసీఆర్‌ అన్నారు.

Exit mobile version