Site icon Prime9

BRS Flexi : ఢిల్లీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు

BRS Flexi

BRS Flexi

BRS Flexi : ఢిల్లీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు రేపు బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తొలగించారు.ఢిల్లీలోని సర్ధార్ పటేల్ రోడ్డులో బీఆర్ఎస్ కు తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేశారు.టీఆర్ఎస్ ఎంపీలు, కేసీఆర్ నివాసం వద్ద కూడ ఫ్లెక్సీలను సిద్దం చేశారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై న్యూఢిల్లీ మున్సిపల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీని విస్తరించాలని భావిస్తున్న కేసీఆర్ నేడు, రేపు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఈ యాగం ఏర్పాటు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు కార్యక్రమంలో సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ , రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ తదితరులు హాజరు కానున్నారు.

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడాన్ని ఆమోదిస్తూ ఈసీ కేసీఆర్ కు లేఖను పంపింది. ఈ నెల 9వ తేదీన ఈసీ పంపిన లేఖపై కేసీఆర్ సంతకం చేశారు.ఈ లేఖను ఈసీకి పంపారు కేసీఆర్. 2024 పార్లమెంట్ ఎన్నికలముందుగా జరిగే కర్ణాటక ఎన్నికల్లో బిఆర్ఎస్ జనతాదళ్ (ఎస్) తో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగే అవకాశముందని భావిస్తున్నారు. కేసీఆర్ జాతీయపార్టీ ఏర్పాటుకు ముందునుంచి జేడీఎస్ అధినేత కుమారస్వామి మద్దుతు పలుకుతున్న విషయం తెలిసిందే.

Exit mobile version