Prime9

Statue in disputed area: వివాదాస్పద ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు

NTR Dist: వివరాల్లోకి వెళ్లితే ఎన్టీఆర్ జిల్లాలోని రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం శివారు మెట్టగూడెం సెంటర్‌లో గల వివాదాస్పద స్థలంలో గత రాత్రి వైసీపీ నేతలు దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 15 ఏళ్లుగా విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం నడుస్తోంది. మెట్టగూడెం సెంటర్‌లో విగ్రహం ఏర్పాటుపై పోలీసులు ఆంక్షలు విధించారు. గతంలో వైఎస్‌ఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు యత్నించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గణేష్ నిమజ్జనం ఉత్సవం ఊరేగింపు సందర్భంగా భారీ సంఖ్యలో వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు.

అధికారం ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు, ఏమైనా చేయ్యవచ్చు అన్న ధోరణిలో అధికార పార్టీ నేతలు ప్రయత్నించడాన్ని స్థానిక ప్రజలు ఖండిస్తున్నారు. వివాదాస్పద స్థలంలో విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని, తక్షణమే వైఎస్సార్‌ విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు.

Exit mobile version
Skip to toolbar