Site icon Prime9

నాగార్జున: వీధికుక్కలను మీ ఇంటి ముందు పడేస్తే ఎలా ఉంటుంది?.. నాగార్జునపై నెటిజన్ ఫైర్

Dogs

Dogs

Nagarjuna: సోషల్ మీడియా వచ్చాక ప్రశ్నించే గొంతులు పెరిగాయి. ప్రభుత్వాలనయినా, ప్రైవేట్ వ్యక్తులనయినా విమర్శించడానికి, సూచనలు ఇవ్వడానికి ఎవరూ సంకోచించడం లేదు. తాజాగా ఒక యువకుడు టాలీవుడ్ కింగ్ నాగార్జునను ట్విట్టర్ లో ప్రశ్నించిన తీరు చర్చనీయాంశమయింది. ఎందుకు మీ భార్య మధ్యతరగతి వాళ్ళని వేధిస్తుంది అంటూ అడిగాడు.

వ్యాక్సినేషన్ చేసిన వీధి కుక్కలని తిరిగి వీధుల్లో వదిలేయటంపై.. నా ఫిర్యాదుకి జిహెచ్ఎంసి స్పందించింది. సుప్రీం కోర్టులో బ్లూ క్రాస్ నుండి అమల అక్కినేని ఫిర్యాదు కారణంగా తాము ఈ విషయంలో ఏమి చేయలేమని.. నివాసితుల ఫిర్యాదులకు తాము న్యాయం చేయలేమని కుక్కలని వదిలేసే ప్రైవేట్ కాంట్రాక్టర్ పేర్కొన్నాడు. దీనికంతటికి మీ భార్య అమలనే కారణం. మధ్యతరగతి వారిని అమల ఎందుకు వేధిస్తోంది? వీధి కుక్కలన్నింటినీ మీ ఇంటి ముందు పడేస్తే మీకు ఎలా ఉంటుంది అంటూ నెటిజన్ ట్విట్టర్ లో నాగార్జునను ఘాటుగా ప్రశ్నించాడు.

ప్రధాన నగరాలు, మున్సిపాలిటీల్లో వీధి కుక్కలు పాదాచారులు, పసి పిల్లలపై దాడిచేయడం అందరికీ తెలిసిన విషయమే. కొన్నిచోట్ల వీధికుక్కల దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన పిల్లలు కూడా ఉన్నారు. దీనితో నెటిజన్ ట్వీట్ కు మద్దతుగా పలువురు కామెంట్లు పెడుతున్నారు. కుక్కలని చంపకూడదని కోర్టుల్లో కేసులు వేసిన అమల అక్కినేని ఎప్పుడైనా కుక్కల బాధితులని పరామర్శించారా.. కుక్క కాట్లకు బలైన పేదలకు ఎప్పుడైనా ఆర్థిక సహాయం చేశారా.. కుక్కలని హతమార్చే హక్కు మనుషులకి లేనప్పుడు.. ఆ కుక్కలని మీ ఇంటి ముందు పెంచడం లేదు. చిన్నపిల్లలను కుక్కలు కరిచినపుడు అమల ఏసీ పెట్టుకుని పడుకుంటుంది అంటూ రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై నాగార్జున ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version