Site icon Prime9

YS Sharmila: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారు

YS Sharmila

YS Sharmila

 YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 4న షర్మిల కాంగ్రెస్‌లో చేరనున్నారు. 4న ఢిల్లీకి రావాల్సిందిగా షర్మిలకు ఖర్గే ఆహ్వానం పలికారు. రాహుల్, ప్రయాంక, ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. రెండు నెలల కిందట తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల ఢిల్లీలో రాహుల్, సోనియాలతో సమావేశమయిన విషయం తెలిసిందే.

పార్టీ బలోపేతానికి..( YS Sharmila)

ఇటీవల ఢిల్లీలో పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ షర్మిల చేరికపై ఆంధ్రప్రదేశ్ నేతల అభిప్రాయాన్ని కోరినట్లు సమాచారం.ఆమెను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవాలని ఏపీలోని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్ కుమార్తెగా ఆమె కాంగ్రెస్‌లో చేరడం ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు. దీనితో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దమయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా మిగిలిన వారు టీడీపీలో చేరారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర విభజన తరువాత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల పాలన చూసిన ప్రజలు కాంగ్రెస్ వైపు కొంతమందైనా మొగ్గు చూపే అవకాశముందని అగ్రనేతలు భావిస్తున్నారు. అధికార వైసీపీ, టీడీపీ లేదా ఎవరయినా సరే కాంగ్రెస్ లో చేరడానికి ముందుకు వస్తే వారిని చేర్చుకోవాలని రాహుల్ గాంధీ ఏపీ నేతలకు చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 శాతం ఓట్లను సంపాదించాలని ఈ దిశగా ప్రణాళికలను రూపొందించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.

మరోవైపు షర్మిల తన పార్టీనేతలతో సమావేశమయి కాంగ్రెస్ లో చేరే విషయమై చర్చించనున్నారు. ఏ పరిస్దితుల్లో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందనేది వివరించి వారి అభిప్రాయాలను కూడా తీసుకుంటారు. అనంతరం ప్రైవేట్ విమానంలో బయలు దేరి ఇడుపుల పాయలో వైఎస్సార్ ఘాట్ కు చేరుకుంటారు. అక్కడ తన కుమారుడి వెడ్డింగ్ కార్డును ఉంచి తండ్రి ఆశీస్సులను తీసుకుంటారు. ఈ మేరకు కాబోయే వధూవరులను తీసుకుని ఆమె బయలుదేరుతున్నారు.

కాంగ్రెస్ లోకి షర్మిళ.. కీలక బాధ్యతలు ఇవే | AP Congress | Ys Sharmila | Prime9 News

Exit mobile version
Skip to toolbar