Site icon Prime9

Nandyal: ఇదెక్కడి మాస్ రివేంజ్ రా మావా.. ఆసుపత్రిలోనే బ్లేడుతో భర్త గొంతు కోసిన భార్య

nandhyal latest crime news

nandhyal latest crime news

Nandyal: నంద్యాల సర్వజన ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యను పరామర్శించేందుకు వచ్చిన భర్తను భార్య బేడ్లుతో గొంతుకోసింది. దానితో భర్త తీవ్ర రక్త స్రావంతో అక్కడే పడిపోయాడు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉంది.

వివరాల్లోకి వెళ్తే గత కొద్ది కాలంగా నంద్యాలకు చెందిన బ్రహ్మయ్య అతని భార్య నివాసం ఉంటున్నారు. కాగా ఆ భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
ఈ నేపథ్యంలోనే పది రోజుల క్రితం భార్యాభర్తలు మధ్య తగాదా జరిగి అది కాస్త చిలికి చిలికి గాలివానలా మారి భార్యపై భర్త బ్రహ్మయ్య దాడి చేశాడు. దానితో భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను వెంటనే నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్యను ఈరోజు ఉదయం భర్త బ్రహ్మయ్య పరామర్శించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే మరో సారి ఆసుపత్రిలోనే భార్యాభర్తలు గొడవపడ్డారు. దీనితో బెడ్ పైనే ఉన్న భార్య కోపంతో భర్త బ్రహ్మయ్య పై బేడ్లుతో గొంతు కోసింది. దానితో తీవ్ర రక్తస్రావంలో ఉన్న బ్రహ్మయ్యకు వెంటనే అక్కడే ఉన్న వైద్య సిబ్బంది చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version