Site icon Prime9

Revanth Reddy comments: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy comments: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వస్తున్న వ్యాఖ్యలపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. షర్మిల ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మనిషని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవడానికేనని రేవంత్ స్పష్టం చేశారు.

షర్మిల ఏపీ కాంగ్రెస్ కు పనిచేస్తే మంచిది..(Revanth Reddy comments)

షర్మిల వచ్చి తెలంగాణకి నాయకత్వం వహిస్తా అంటే ఊరుకుంటామా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి తెలంగాణకి నాయకత్వం వహించరని ఆయన తేల్చేశారు. షర్మిల ఏపీ కాంగ్రెస్‌కి పనిచేస్తే స్వాగతిస్తానని రేవంత్ అన్నారు. షర్మిల ఏపీసీసీ చీఫ్ అయితే సహచర పీసీసీ చీఫ్‌గా ఆమెని కలుస్తానని రేవంత్ చెప్పారు. తాను పీసీసీ చీఫ్‌గా ఉన్నన్ని రోజులు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండదని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టేశారు. షర్మిల తెలంగాణకి నాయకత్వం వహిస్తాను అంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కించ పరచడమేనని రేవంత్ అన్నారు.

Exit mobile version