Hyderabad: రాజ్ భవన్ – ప్రగతి భవన్ ల మద్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో తెరాస ప్రభుత్వం పై గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన 8 బిల్లుల ఆమోద ముద్ర పై గవర్నర్ వర్సస్ ప్రభుత్వం మద్య నడుస్తున్న వార్ సమయంలో గవర్నర్ తమిళిసై మీడియాతో ప్రత్యేకంగా సమావేశమైనారు.
బిల్లుల ఆమోదం పై ప్రభుత్వం గుప్పిస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ఆమోదం కొరకు కొన్ని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. అందులో విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకాల బిల్లు కూడా ఒకటన్నారు. అయితే దీనిపై కొంత న్యాయ పరమైన అంశాలు మిళితమైవున్నాయన్నారు. వాటిని అన్ని సమగ్రంగా పరిశీలిస్తున్నామన్నారు. ఇంతలోనే బిల్లుల అంశాల పై నా పై తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. కొత్తగా రిక్రూట్ బోర్డు ఎందుకన్నారు. 8ఏళ్లుగా లేని భర్తీ నియమకాలు ఇప్పుడు ఉంటాయా? అని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కూడా చెప్పాను.
దీంతో పాటు పలు ప్రశ్నలను గవర్నర్ తమిళిసై ప్రభుత్వం పై గుప్పించారు. రాజ్ భవన్ ను ముట్టడిస్తామంటూ విద్యార్ధి జేఏసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. 8ఏళ్లుగా ప్రగతి భవన్ వద్ద ఎందుకు ఆందోళనలు చేయలేదని గవర్నర్ ప్రశ్నించారు. వారిని ఆందోళనలకు దిగేలా ఎవరు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. నా ఫోన్ కూడా ట్యాపింగ్ గురైన్నట్లు అనుమానంగా ఉందన్నారు. ఫామ్ హౌస్ కేసులోనూ రాజ్ భవన్ ను లాగాలని ప్రయత్నించారు. అయితే వ్యవహారం కోర్టులో ఉండగా తాను ఎక్కువడా మాట్లాడనని తమిళిసై అన్నారు. నాకు వీటన్నింటి పైన వివరణ అందాల్సిన అవసరం ఉందన్నారు.
టిఆర్ఎస్ ట్విటర్ ఖాతా నుండి రాజ్ భవన్ పేరును ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో లాగే ప్రయత్నం చేశారన్నారు. ట్వీట్ లో చాలా విషయాలు కూడా పొందుపరిచారన్నారు. మరో రెండు గంటల్లో అందుకు సంబంధించిన వివరాలు కూడా వస్తాయని ప్రజల్ని తప్పుదోవ పట్టించారన్నారు. ఆ ట్విటర్ ప్రకటనలో తుషార్ అని కూడా పేర్కొన్నారు. తుషార్ గతంలో నా వద్ద ఏడీసీగా పనిచేశారన్నారు. అంత మాత్రానా రాజ్ భవన్ ను ఫామ్ హైస్ కేసులో లాగుతారా అని ప్రశ్నించారు. తుషార్ పేర్లు ఒకరికే ఉంటాయా అని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ED Raids: మంత్రి గం గుల నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు!