Site icon Prime9

TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ లో కటాఫ్ ఉండదు

TSPSC Exam Schedule

TSPSC Exam Schedule

TSPSC: అక్టోబర్ 16న గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా 503 పోస్టులకు గానూ మెుత్తం 2 లక్షల 86 వేల 51 మంది అభ్యర్ధులు ఈ పరీక్ష రాశారు. అయితే క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా, ప్రశ్నలు సివిల్స్ స్థాయిలో ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులపై క్లారిటీ ఇచ్చింది. ప్రిలిమ్స్ పరీక్షలో కటాఫ్ మార్కులు ఉండవని వెల్లడించింది. ప్రిలిమనరీ పరీక్ష కేవలం అభ్యర్థులను ఫిల్టర్ చేయడానికి మాత్రమే అని టీఎస్పీఎస్సీ పేర్కొనింది. మల్టీజోన్, రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్ కు సెలెక్ట్ చేస్తామని స్పష్టతనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు 75 శాతం మంది ఆశావహులు హాజరు కాగా ఈ పరీక్ష నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,019 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ను పరీక్ష పూర్తయిన ఎనిమిది రోజుల్లోగా విడుదల చేస్తామని కమిషన్ తెలిపింది.  మెయికాగా మెయిన్స్ పరీక్ష డిసెంబరులో జరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: TSPSC Group-1: గ్రూప్-1 పరీక్షల్లో కొత్త మార్పులు.. ఈ సారి అన్నీ జంబ్లింగే..!

Exit mobile version