TRS Win: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ఎట్టకేలకు విజయం సాధించింది. హోరా హోరీగా సాగిన ఉప ఎన్నికల పోటీలో తెరాస అభ్యర్ధి కూసుగుంట్ల ప్రభాకర రెడ్డి 11666 ఓట్ల ఆధిక్యంతో సమీప భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై విజయభావుట ఎగరవేశారు. ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపారు.
తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్తు దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రక్రియ తెరాస విజయంతో ముగిసింది. నవంబర్ 3న జరిగిన ఉప ఎన్నికలను ఎన్నికల కమీషన్ నేడు లెక్కింపు నిర్వహించింది. 15 రౌండ్ల లెక్కింపులో రెండు, మూడు రౌండ్లు మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ తెరాస పార్టీ విజయదుంధుభిని మోగించింది. తొలుత ఉత్కంఠానికి తెరతీసినా, అనంతరం లభించిన ఓట్ల మెజారిటీ తెరాస శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది.
12వ రౌండ్ ఫలితాల్లో దాదాపుగా 7836పై చిలుకు ఓట్లు తెరాసకు లభించడంతో ప్రగతి భవన్ వద్ద కార్యకర్తల కోలాహలం మిన్నంటింది. మిఠాయిలు పంచిపెట్టారు. టపాకాయలు పేల్చి తమ అధినేతకు బీఆర్ఎస్ పార్టీకి ముందస్తు విజయమంటూ నినాదాలతో హోరెత్తించారు. ఉప ఎన్నికల ఫలితాల్లో రెండవ స్థానంలో భాజపా ఉండగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి డిపాజిట్ కూడ దక్కలేదు.
మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాసకు విజయం తప్పనిసరిగా మారింది. తెరాస పార్టీని భారాస జాతీయ పార్టీగా మార్చిన అనంతరం మునుగోడు ఉప ఎన్నికలు రావడంతోపాటు 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నేటి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో తెరాస శ్రేణులకు మునుగోడు ఎన్నికలు కీలకంగా మారాయి. దీంతో యావత్తు అధికార పార్టీకి చెందిన 100కు పైగా కీలక నేతలు మునుగోడు నియోజకవర్గంలో నెలరోజులుగా మకాం వేసి విజయానికి తీవ్రంగా శ్రమించారు.
మరోవైపు ప్రత్యర్ధ పార్టీ భాజపా సైతం అధికార పార్టీకి గట్టిగానే పోటీ ఇచ్చింది. ఎన్నికల్లో నైతికంగా అధికార పార్టీని విజయం వరించినా, భారీ మెజార్టీ కట్టడికి భాజపా శ్రేణులు కూడా పట్టుదలగా ప్రచారం నిర్వహించారు. 2018 ఎన్నికల్లో భాజపాకు కేవలం 12725 ఓట్లు మాత్రమే లభించాయి. ఆప్పట్లో కాంగ్రెస్ కు 99239 ఓట్లు రాగ, తెరాసకు 61687 ఓట్లతో నాటు రెండో స్థానానికి పరిమితమైంది. తాజా ఎన్నికల్లో భాజపాకు 86వేలకు పైగా ఓట్లు రావడం గమనార్హం. నాడు కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ పార్టీకి రాజీనామాతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నికలు అనివార్యమైనాయి.
యావత్తు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో భారీ ఆధిక్యాన్ని అందుకొనేలా చేసిన వ్యూహ ప్రతివ్యూహాలకు భాజపా చెక్ పెట్టిందనే చెప్పాలి. భాజపా అగ్రనేతలు ఎవ్వరూ లేకుండా అధికార పార్టీకి బలమైన పోటీని భాజపా రాష్ట్ర నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, తదితరులు ఇచ్చారు. ఉప ఎన్నికల ఫలితాల్లో మంత్రులు శ్రీనివాసగౌడ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డిల ఇన్ చార్జ్ లుగా వ్యవహరించిన గ్రామాల్లో భాజపా ఆధిక్యం కనపర్చింది. అంతేగాకుండా తెరాస అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సొంత ఊరిలో ప్రత్యర్ధికి కన్నా తక్కువ ఓట్ల పడడం ఆ పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది.
సీఎం కేసిఆర్ సభతో, తెరాస శ్రేణులు భారీ ఆధిక్యాన్ని ఆశించిన్నప్పటికీ పెద్దగా రాకపోవడం వంటి అంశాలు రానున్న అసెంబ్లీ ప్రభావం చూపనున్నాయి. ఎందుకంటే వ్యవస్ధలను అడ్డుపెట్టుకొని మరీ అధికార పార్టీ తన హవాను చూపించిందని ప్రచారంలో పదే పదే ప్రతిపక్షాలు పేర్కొనివున్నాయి. ప్రతిపక్ష నేతల ప్రచారంలో దాడులు జరిగిన్నప్పటికీ పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం గమనార్హం. భాజపా నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేంధర్ అత్తగారు ఊరైన పలివెలలో భాజపాకు 400 ఓట్లు ఆధిక్యం రావడం తెరాస ఎమ్మెల్సీ పల్లాకు తీవ్ర నిరాశ కల్గించింది. ఎందుకంటే అక్కడ తెరాస అభ్యర్ధికి పల్లా ఇన్ చార్జ్ గా వ్యవహరించారు.
ఇది కూడా చదవండి: Munugode by poll: ఫలితాలు ఆలస్యంపై సీఈవో వివరణ..