Site icon Prime9

Telangana High Court: పబ్బులపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు

Telangana High Court restrictions on pubs

Telangana High Court restrictions on pubs

Hyderabad: భాగ్యనగరంలోని పబ్స్ నిర్వహణ పై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 10గంటల నుండి ఉదయం 6గంటలకు ఎలాంటి డిజేలు ఉండకూడదని మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. సిటీ పోలీసు యాక్ట్, వాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్ధేశిత మేరకు మాత్రమే అనుమతి ఉందని కోర్టు పేర్కొనింది. రాత్రి వేళల్లో ఎటువంటి సౌండ్ సిస్టంకు అనుమతి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

నివాసప్రాంతాలు, విద్యా సంస్ధలు ఉన్న ప్రదేశాల్లో పబ్ లకు ఎలాంటి నిబంధనలకు లోబడి అనుమతి ఇచ్చారని ఎక్సైస్ శాఖను ప్రశ్నించింది. టాట్ పబ్ విషయం పై న్యాయస్ధానంలో పిటిషన్ దాఖలైంది. ఈమేరకు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమీషనర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Exit mobile version