Site icon Prime9

PM Modi Warangal Tour: ప్రధాని మోదీ “వరంగల్ పర్యటన”.. 10 వేల మంది పోలీసుల పహారా

PM modi warangal tour

PM modi warangal tour

PM Modi Warangal Tour: ప్రధాని నరేంద్రమోదీ వరంగల్ పర్యటించనున్న సందర్భంగా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో పకడ్బంధీగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. అధికారులే కాకుండా భారతీయ జనతా పార్టీ శ్రేణులు సైతం ఈ ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుని దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఈ ప్రాంగణంలోనే రెండు వేదికలను ఏర్పాటు చేయనున్నారు. ఒక వేదికపై నుంచి వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుండగా.. మరో వేదిక నుంచి బహిరంగ సభకు వచ్చే బీజేపీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

10 వేల మందితో భద్రత(PM Modi Warangal Tour)

ఇకపోతే శనివారం 8 జూలై 2023న వరంగల్ లో ప్రధాని సభ నేపథ్యంలో భద్రతా దళాలు హెలికాఫ్టర్ ద్వారా గస్తీ నిర్వహిస్తున్నారు. వరంగల్ నగరంలో 27 కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ కాన్వాయ్‌ సాగనుంది. మామునూరు ఎయిర్‌పోర్టు నుంచి బట్టల బజార్‌ ఫ్లైఓవర్‌, పాపయ్యపేట చమన్‌, భద్రకాళి ఆలయం, ములుగు రోడ్డు, అలంకార్‌ జంక్షన్‌, హనుమకొండ చౌరస్తా, పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌, అంబేద్కర్‌ జంక్షన్‌, కాళోజీ జంక్షన్‌ మీదుగా ప్రధాని పర్యటన జరుగనుంది. ప్రధాని భద్రతా ఏర్పాట్లలో భాగంగా 10 వేల మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు వరంగల్ సీపీ ఏవి రంగనాథ్ వెల్లడించారు. అంతేకాకుండా ఇవాళ నుంచి నుంచి వరంగల్ నగరంలో రెండు రోజుల పాటు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఇక ఇందులో భాగంగానే వరంగల్ నగరాన్ని నోఫ్లై జోన్ గా అంటే దాదాపు నగారానికి 20 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఆకాశంలో పోలీసు శాఖ ఆంక్షలు విధించింది.

అయితే సభా వేదికపై ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై పాల్గొనేలా పీఎంవో ఏర్పాట్లు చేశారు. అయితే కేసీఆర్ ఈ సారి అయినా ప్రధాని సభలో పాల్గొంటారా లేదా అనేది స్పష్టంగా తెలియదు. ఇక ఈ సభలో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరి, కిషన్‌రెడ్డి సహా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పాల్గొంటారని పీఎంఓ నుంచి సమాచారం అందింది.

Exit mobile version