Site icon Prime9

PM Modi : వరంగల్ లో ప్రధాని మోదీ.. ఇది దేశానికి స్వర్ణయుగం అంటూ ప్రసంగం.. లైవ్ !

pm modi speech from warangal live

pm modi speech from warangal live

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ నేడు వరంగల్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అలానే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు ప్రధానమంత్రి మోదీ. దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకమైనది అంటూ కితాబు ఇచ్చారు.

దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని.. ఇది దేశానికి స్వర్ణయుగమని అభివర్ణించారు. ఆరు వేలకోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నామని.. దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నామని అభిప్రాయపడ్డారు. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రీయల్ ఎకనామిక్ కారిడార్లు ఏర్పాట్లు చేస్తున్నామని.. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని గుర్తు చేశారు. కరీంనగర్‌ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తోందని తెలిపారు. అలానే ప్రధాని ప్రసంగం ప్రత్యక్షప్రసారం మీకోసం ప్రత్యేకంగా..

YouTube video player

Exit mobile version
Skip to toolbar