Site icon Prime9

Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం పై ప్రధాని దిగ్బ్రాంతి.. రూ.2లక్షల ఆర్థికసాయం

pm modi reply on secumderabad Fire accident

pm modi reply on secunderabad Fire accident

Secunderabad: తెలంగాణ, సికింద్రాబాద్‌ రూబీ లాడ్జిలో జరిగిన భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాగా దీనిపై సీఎం కేసీఆర్  పాటు పలువురు మంత్రులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటన పై స్పందించారు.

సికింద్రాబాద్లోని రూబీ లాడ్జిలో గత రాత్రి భారీ అగ్రిప్రమాదం జరిగిన సంగతి విధితమే. కాగా లాగ్జి సెల్లార్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో బ్యాటరీ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ఈ ప్రమాదంలో లాడ్జిలో ఉన్న టూరిస్టుల్లో సజీవదహనం అయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ప్రమాదం పై ప్రధాని మోదీ స్పందించారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. ఈ ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్ధికసాయం, ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ఇస్తామని మోదీ వెల్లడించారు.

ఇదీ చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

Exit mobile version