Site icon Prime9

BJP Meeting : బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభలో ఓకే వేదిక పైకి.. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్.. లైవ్

pm modi and pawan kalyan participated in BJP Meeting at hyderabad

pm modi and pawan kalyan participated in BJP Meeting at hyderabad

BJP Meeting : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ (BJP) కూడా ప్రచారంలో దూకుడు పెంచింది. అందులో భాగంగానే నేడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రధాని మోదీ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నారు. వారితో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, పలువురు నేతలు హాజరయ్యారు.  అంతకు ముందు హైదరాబాద్‌ చేరుకున్న ప్రధాని మోడీకి బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు.

ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హయాంలో ఉగ్రదాడులు తగ్గిపోయాయని అన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపిన నేత మోదీ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ ఉద్యమ నినాదాలని.. కానీ ఆ మూడు నెరవేరాయా లేదా అనేది రాష్ట్రంలో పెద్ద ప్రశ్నగా మిగిలిందన్నారు. జల్, జంగిల్, జమీన్ నినాదాలతో కుమురం భీమ్ పోరాడారని, సకల జనులు పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే జమ్మూకాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దుచేసే వారు కాదన్నారు. ఎన్నికలే ముఖ్యమని భావిస్తే మహిళా బిల్లు సాకారం చేసేవారు కాదని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మోడీ సభ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు. సభకు వెళ్లే వారి కోసం 6 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

Exit mobile version