Site icon Prime9

Pawan Kalyan : నేడు మూడు సభల్లో పాల్గొననున్న జనసేనాని.. కొత్తగూడెం ప్రచార సభలో పవన్ ఏం మాట్లాడారంటే ??

Pawan Kalyan speech at kothagudem meeting for assembly elections

Pawan Kalyan speech at kothagudem meeting for assembly elections

Pawan Kalyan : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కి మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారంలో ప్రధాన పార్టీలన్ని మరింత స్పీడ్ పెంచాయి. బీజేపీ అగ్రనేతలు అయిన మోదీ, అమిత్ షా ఇప్పటికే తెలంగాణలో ప్రచారం నిర్వహించగా.. ఇప్పుడు తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నిన్న వరంగల్‌లో పర్యటించిన పవన్‌.. ఇవాళ కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమయాభావం వల్ల ఎక్కువ నియోజకవర్గాలు తిరగలేకపోతున్నానని చెప్పారు. ఎక్కడైతే బీజేపీ అభ్యర్థులు ఉన్నారో అక్కడ జనసేన శ్రేణులు, అలాగే జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట బీజేపీ శ్రేణులు మద్దతుగా నిలబడాలని పవన్ కోరారు. తనది హ్యమనిజమని అన్నారు. ఆంధ్రాలో గుండాలను రౌడీలను ఎదుర్కొని నిలబడ్డాను అంటే తెలంగాణ ఉద్యమ స్పూర్తే కారణమని మరోసారి స్పష్టం చేశారు. కమ్యూనిస్టులతో .. బీజేపీతో కలిసి ఉండటానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కారణమని తెలిపారు. సీఎం కేసీఆర్, కేటిఆర్ తో తనకు పరిచయాలున్నాయని..అలాగే కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, విహెచ్ తో కూడా పరిచయం ఉన్నాయని..కానీ తన మద్దతు మాత్రం బీజేపీకేనని అలాగే ప్రధాని మోదీకేనని పవన్ మరోసారి స్పష్టం చేశారు.

అలానే సనాతన ధర్మం, సోషలిజం రెండు కలిసి నడిపేదే జనసేన (Pawan Kalyan) అని అన్నారు. 1200 మంది తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ఎనిమిది మంది జన సైనికులు పోటీ చేస్తున్నారని వారికి మీరు అండగా ఉండాలని ఓటు వేసి గెలిపించాలని కోరారు. నీళ్ళు, నిధులు, నియమాకాలుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని..దశాబ్దం పాటు ఎదురు చూశానని అన్నారు. అణగారిన ప్రజలు, కడుపు మండి పోరాడే యువతకు జనసేన, బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీపై తనకు అపారమైన నమ్మకముందని అందుకే ఆయనతో ఉండాలనుకున్నానని తెలిపారు.

మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రధాని కావాలని ప్రచారం చేశానని గుర్తు చేశారు. నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయనన్నారు. తెలంగాణ పోరాట స్పూర్తి దేశం అంతా ఉంటే అవినీతి పోయేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో 65 మంది సీఎంలు వస్తే ..25 మంది బీసీలేనని అన్నారు. ఈ సంరద్భంగా పవన్ గద్దర్ ను గుర్తు చేసుకుంటు.. గద్దరన్న చనిపోయే ముందు ఒకటే కోరాడు అదేమంటే తెలంగాణలో యువతకు అండగా ఉండాలని తెలిపారు. గద్దరన్న ఆశయం కోసం నిలబడుతానన్నారు.

ఇక మరోవైపు దీనిలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రాత్రి హైదరాబాద్‌ చేరుకున్న నడ్డాకు బీజేపీ నేతలు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. ఐటీసీ కాకతీయలో బసచేశారు. ఇవాళ బీజేపీ ముఖ్య నేతల సమావేశమవుతారు నడ్డా. తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకి నిజామాబాద్‌ అర్బన్‌లో ప్రచారం చేస్తారు. అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత జేపీ నడ్డా సంగారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొంటారు.

Exit mobile version