Site icon Prime9

Nagar karnool ZP Chairman: నాగర్ కర్నూల్ లో మరోమారు మోగిన ఎన్నికల నగారా..!

nagarkurnool-zp-chairman-election 2022-notification released

nagarkurnool-zp-chairman-election 2022-notification released

Nagar karnool ZP Chairman: ఇటీవల కాలంలో ముగ్గురు పిల్లలు ఉన్న కారణంగా నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న పద్మావతిని పదవి నుంచి తొలగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దానితో నూతన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎంపిక ఉత్కంఠ భరితంగా మారనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనితో మరోసారి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపిక జరుగనుంది. ఈనెల 15వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలకానుంది. ఎన్నికల అధికారులు ఈనెల 22వ తేదీన జడ్పీ ఛైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏదైనా కారణాలవల్ల ఎన్నిక వాయిదా పడితే మరుసటి రోజు 23వ తేదీ ఉదయం 11 గంటలకు చైర్మన్ ఎన్నికలను నిర్వహిస్తారు.

అప్పట్లో భరత్ ను కాదని పద్మావతికి పట్టం..

2019లో రాష్ట్రంలో మొత్తం 20 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో భాగంగా అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 17 స్థానాలను గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలు మాత్రమే దక్కాయి. ఇకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేసిన కారణంగా ఎంపీ రాములు కుమారుడు భరత్‌ప్రసాద్‌కు చైర్మన్ అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్య రీతిలో ఎమ్మెల్యేలు భరత్‌ప్రసాద్ ఎంపికకు సహకరించలేదు. దానితో ఎమ్మెల్యేలు సూచించినట్లుగా తెలకపల్లి రిజర్వు స్థానం నుంచి గెలుపొందిన పద్మావతిని జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా అధికారులు అప్పట్లో ఎంపిక చేశారు. అయితే ముగ్గురు సంతానం ఉన్న కారణంగా ఆమె ఇటీవలే జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవితో పాటు, జెడ్పీటీసీ పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. దానితో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్రను ఇటీవల అధికారులు జడ్పీఛైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇన్‌చార్జి జెడ్పీ చైర్మన్‌గా ప్రస్తుత వైస్ చైర్మన్ బాలాజీసింగ్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం జెడ్పీ చైర్మన్ ఎంపికకు సంబంధించిన నోటిఫికేషన్ను తాజాగా జారీ చేసింది. దానితో మరోసారి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరోసారి బరిలోకి భరత్.. ఎమ్మెల్యేల సహకారం లభించేనా..

జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం 2019లో చివరిదాకా ప్రయత్నించి అవకాశం లభించక తీవ్ర నిరాశకు గురైన భరత్‌ప్రసాద్ ఇప్పుడైనా తనకు అవకాశం ఛాన్స్ దొరుకుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. అప్పట్లో జిల్లాలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు కూడా తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల దృష్ట్యా భరత్‌ప్రసాద్కు సహకరించకపోవడంతో అవకాశం దక్కలేదని పార్టీ వర్గాలు అంతర్గత సమాచారం. మరి ఇప్పుడు కూడా భరత్‌ప్రసాద్ ఎంపికకు వారు అడ్డు తగులుతారా..?
లేక సహకరిస్తారా..? అనేది వేచిచూడాలి.

బాధ్యతలన్నీ నిరంజన్ రెడ్డికే..

ఇదిలా ఉంటే ఎంటువంటి మనస్ఫర్థలు రాకుండా జిల్లా పరిషత్ చైర్మన్ను ఎంపిక చేయాలని ఈ బాధ్యతలను సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. పార్టీకి నష్టం జరగకుండా, ఎమ్మెల్యేల ఏకాభిప్రాయంతో ఎన్నికను నిర్వహించేలా మంత్రి నిరంజన్‌రెడ్డికి కార్యచరణలు మొదలుపెట్టారు. మరి ఈ నాగర్ కర్నూల్ ఛైర్మన్ పీఠం ఎవరిని వరించనుందో వేచి చూడాలి.

ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ ‘వారాహి’ టార్గెట్ చేసిన ఆ రక్త బీజుడు ఎవరు?

Exit mobile version