Site icon Prime9

Munugode Bypoll Counting: రేపే మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్..

counting

counting

Munugode: మునుగోడు ఉప ఎన్నికల కౌటింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్గొండలోని అర్జాల భావిలోని వేర్ హౌసింగ్ గోడన్స్ లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. కౌంటింగ్ కోసం మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేసారు అధికారులు. మొత్తం 15 రౌండ్స్ లలో ఈ కౌంటింగ్ ను పూర్తి చేయనున్నారు. ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ కేంద్రాలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 15 రౌండ్స్ లల్లో లెక్కిస్తారు

పోలింగ్ ఏజెంట్ల అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను ఏర్పాటు చేసారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో మొదటి రౌండ్ ప్రారంభం కానుంది. మునుగోడులో 686 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత ఈవిఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్ కి కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్లను నియమించారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు ఉండనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కౌంటింగ్ పూర్తి చెయ్యనున్నారు అధికారులు.

జిల్లా ఎన్నికల అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణ లో ఈ కౌటింగ్ ప్రక్రియ జరుగనుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో, సీసీ కెమెరా ల పర్యవేక్షణలో 24 గంటల పాటు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 93.13% పోలింగ్ శాతం నమోదైంది. మునుగోడు ఉపఎన్నికలో రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లలో 2,25,192 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ అధికారులు తెలిపారు.

Exit mobile version