Site icon Prime9

Marri Sashidhar Reddy : చాలా బాధతోనే కాంగ్రెస్‌తో బంధం తెంచుకుంటున్నా… మర్రి శశిధర్ రెడ్డి

Marri Sashidhar Reddy

Marri Sashidhar Reddy

Marri Sashidhar Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. తాను రాజీనామా లేఖను పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీతో తన బంధాన్ని తెంచుకుంటున్నానని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పరిస్థితి వస్తుందని తాను ఏనాడూ ఊహించలేదని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. ఇవాల్టి నుంచి కాంగ్రెస్ హోంగార్డుగా ఉండటం లేదని తెలిపారు. టీ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌తో కుమ్మక్కు అయ్యారనే విషయం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పీసీసీ అయ్యాక అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. పార్టీ ఇంచార్జ్‌లు నేతలను సమన్వయం చేయలేదు.

ఇంచార్జ్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం. పార్టీలో డబ్బు ప్రభావం చాలా పెరిగిపోయింది. పీసీసీ పదవి కోసం రూ.25 కోట్లు ఇచ్చారని ఓ ఎంపీ ఆరోపించారు. పార్టీలో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ల మాట చెల్లుబాటు అవుతుంది. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కూడా దీనికి బాధ్యత వహించాలి. సోనియాగాంధీ కూడా ఏమీ చేయలేక నిస్సహాయురాలిగా మారారు’ అని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.కుంతియా ఎవరికీ తెలియకుండా 17 మంది పీసీసీ చీఫ్ ఆశావాహుల లిస్ట్ పంపారని అధిష్టానాన్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఉత్తమ్ ఇలా చేయించారని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. 2018లో పార్టీ గెలిస్తే తన ఖాతాలో వేసుకోవ్చని ఉత్తమ్ అనుకున్నారని, కానీ ఆయన అంచనాలు ఫెయిల్ అయ్యాయని తెలిపారు. ఏ సర్వే ఆధారంగా తనకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో 3 వేల ఓట్లు వస్తే ఎవరికీ చీమ కుట్టినట్లు కూడా లేదని, అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిదని ఆరోపించారు.

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారినట్టుగా ఆయన చెప్పారు. పార్టీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గురించి ఠాగూర్ మాట్లాడనిచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించని విషయాన్ని శశిదర్ రెడ్డి వివరించారు. . కోకాపేట భూములపై సీబీఐ విచారణ జరపాలని రేవంత్ లేఖ రాశారని, ఆ తర్వాత ఆయనకు ఒకటి, రెండో విడత అందడంతో సైలెంట్ అయ్యారని మర్రి విమర్శించారు. రేవంత్ ఒక చీటర్ అని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన శశిధర్ రెడ్డి.. త్వరలో బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.

Exit mobile version